క్రీడాభూమి

వివాదాలు వదిలి.. ఆటపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేపియర్, జనవరి 23: గత ఏడాది టీ-20 వరల్డ్ కప్ సందర్భంగా ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్స్‌లో చోటుదక్కని భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ వివాదం సద్దుమణిగిన నేపథ్యంలో ఇపుడు న్యూజిలాండ్‌లో ఆ జట్టు మూడు వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు సిద్ధమవుతోంది. గురువారం ఇక్కడి మైదానంలో తొలి వనే్డలో భారత వనే్డ ఇంటర్నేషనల్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ నాయకత్వంలో జట్టు సత్తా చూపాలని ఉవ్విళ్లూరుతోంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టీమిండియా మహిళా జట్టు ఐదో స్థానంలో ఉన్న నేపథ్యంలో ఆతిధ్య జట్టుతో జరిగే వనే్డలు తమకు చాలా ముఖ్యమైనవని కెప్టెన్ మిథాలీ రాజ్ మ్యాచ్ జరగడానికి ముందుకు జరిగిన మీడియా సమావేశంలో పేర్కొంది. వరల్డ్ కప్‌తోపాటు వరల్డ్ టీ-20లో సైతం న్యూజిలాండ్‌ను తాము ఓడించి సగర్వంతో నిలబడడంతో ఇపుడు ఆతిధ్య జట్టుపై పైచేయి సాధించేందుకు మానసికంగా తామంతా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.