క్రీడాభూమి

పిసిబికి తప్పని నిరాశ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: నిన్నమొన్నటి వరకూ భారత్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ జరుగుతుందని ఆశించిన పిసిబికి నిరాశ తప్పలేదు. భారత్ నుంచి సిరీస్‌పై స్పష్టత లేకపోవడంతో శ్రీలంకలో ఇరు జట్లు తలపడడం అనుమానం స్థాయ నుంచి ఎదిగి అసాధ్యంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో సిరీస్‌పై ఆశలకు దాదాపు తెరపడగా, వివిధ దేశాల మధ్య భవిష్యత్ టూర్లను ఖరారు చేసేందుకు సమావేశమైన ఐసిసి ఆధ్వర్యంలోని ఫ్యూర్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్స్ కమిటీ కూడా ఎలాంటి హామీ ఇవ్వలేకపోవడంతో పిసిబి నీరుగారిపోయింది. భారత్‌తో క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించుకోవడం ద్వారా ఆర్థికంగా బలపడేందుకు పిసిబి ఎన్నో ప్రయత్నాలు చేసింది. బిసిసిఐతో కాళ్ల బేరానికి వచ్చింది. ఐసిసిసహా ఎవరి ఆధ్వర్యంలో, ఏ స్థాయి జరిగే పోటీల్లోనూ భారత్‌తో మ్యాచ్‌లు ఆడకుండా వెలేస్తామని హెచ్చరించింది. కానీ, బిసిసిఐ నుంచి ఎలాంటి సానుకూల ప్రకటనను రాబట్టుకోలేక డీలాపడిపోయింది. పాక్ ప్రభుత్వం నుంచి పిసిబికి గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పటికీ భారత్ నుంచి సమాధానం రాకపోవడం పిసిబిని తీవ్ర నిరాశకు గురి చేసింది.

ఉస్మాన్ ఖాజాకు
ఫిట్నెస్ పరీక్ష
సిడ్నీ, డిసెంబర్ 15: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖాజా ఈనెల 26 నుంచి వెస్టిండీస్‌తో జరిగే టెస్టులో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. గాయాలతో కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న 28 ఏళ్ల ఖాజా పూర్తి ఫిట్నెస్‌తో ఉన్నాడని, బాక్సింగ్ డే టెస్టులో ఆడతాడని ఆసీస్ కోచ్ డారెన్ లీమన్ ప్రకటించిన 24 గంటల్లోనే అతని ఫిట్నెస్‌పై అనుమానాలు వ్యక్తం కావడం గమనార్హం. కాలి కండరాల నొప్పితో బాధపడుతున్న ఖాజాకు విండీస్‌తో జరిగే రెండో టెస్టు కోసం ఎంపిక చేసిన 13 మంది సభ్యులతో కూడిన జట్టులో స్థానం దక్కింది. అయితే, బిగ్ బాష్ టోర్నీ నుంచి అతను వైదొలగడంతో, ఫిట్నెస్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ఆందోళన వ్యక్తం చేస్తున్నది. టెస్టుకు ముందు అతనికి ఫిట్నెస్ పరీక్ష జరుపుతామని తెలిపింది. ఫిట్నెస్ నిరూపించుకున్న తర్వాతే టెస్టులో అతనికి జట్టులో స్థానం కల్పించడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

ఐఎస్‌ఎల్ ఫైనల్‌కు గోవా
న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో గోవా సిటీ ఫుట్‌బాల్ క్లబ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మొదటి సెమీ ఫైనల్ రెండో లెగ్‌లో ఈ జట్టు 3-0 తేడాతో ఢిల్లీ డైనమోస్‌ను ఓడించింది. సెమీస్ మొదటి లెగ్‌లో ఢిల్లీ చేతిలో 0-1 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్న గోవా రెండో లెగ్‌లో అమీతుమీ తేల్చుకోవ డానికి సిద్ధమై దూకుడుగా ఆడింది. మ్యాచ్ 11వ నిమిషంలో జొఫ్రె మతెయూ ద్వారా తొలి గోల్‌ను సంపాదించుకున్న గోవాకు 27వ నిమిషంలో రాఫెల్ కొయెల్హో, 87వ నిమిషంలో డుడూ గోల్స్ చేశారు. కాగా, బుధవారం రెండో సెమీస్ రెండో లెగ్‌లో అట్లెటికో డి కోల్‌కతా, చెనె్నయన్ తలపడతాయ.