క్రీడాభూమి

తొలి గ్రాండ్ శ్లామ్‌పై కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, జనవరి 25: ఆస్ట్రేలియా ఓపెన్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో తన సమీప ప్రత్యర్థి, జపాన్‌కు చెందిన నవోమి ఒసాకాపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తాననే గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేసింది చెక్ రిపబ్లికన్ స్టార్ పెట్రో క్విటోవా. ప్రపంచ 4వ ర్యాం కర్ ఒసాకా, 8వ ర్యాంకర్ క్విటోవా మధ్య శనివారం ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ కోసం, ఆస్ట్రేలియా ఓపెన్ కిరీటం కైవసం చేసుకోవడానికి భీకర పోరు జరగనుంది. ఇప్పటికే రెండుసార్లు (2011, 2014) వింబుల్డన్ చాంపియన్‌గా ఆవిర్భవించిన 28 ఏళ్ల క్విటోవా 2016 తర్వాత తొలిసారిగా గ్రాండ్ శ్లామ్ ఫైనల్స్‌లో చోటుదక్కించుకుంది. ‘ఆస్ట్రేలియా ఓపెన్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరుకోవడం నాకో ప్రత్యేకం. ప్రతీదీ నేను అనుకున్నట్టే జరుగుతోంది’ మ్యాచ్‌కు ముందురోజు మీడియా సమావేశంలో పేర్కొంది. ఫైనల్స్‌లో యూఎస్ ఓపెన్ చాంపియన్ నవోమి ఒసాకాకు గట్టి పోటీ ఇస్తానని గట్టి నమ్మకంతో చెబుతోంది. ‘21 ఏళ్ల ఒసాకా అ ద్భుత క్రీడాకారిణి. మంచి ఫామ్‌లో ఉంది. నా ఆటతీరు కూడా దాదాపు అలాగే ఉంటుంది కనుక ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించగలననే బలమైన నమ్మకం ఉంది’ అని క్విటోవా పేర్కొంది.