క్రీడాభూమి

ఆధిపత్యంపై కన్ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌంట్ మాంగనూయ్, జనవరి 25: ఐదు వనే్డల సిరీస్‌లో భాగంగా నేడు న్యూజిలాండ్‌తో భారత్ రెండో వనే్డ ఆడనుంది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో ప్రత్యర్థి జట్టు కంటే బలంగా ఉన్న భారత్ రెండో వనే్డలోనూ గెలిచి ఆధిక్యం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు మొదటి వనే్డలో ఘోర పరాజయం చవిచూసిన ఆతిథ్య జట్టు వౌంట్ మాంగనూయ్‌లోని ఓవల్ బేలో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి టీమిండియాను కట్టడి చేయాలని భావిస్తోంది. అయతే మొదటి వనే్డలో అనూహ్యంగా 157 పరుగులకే కుప్పకూలడం కివీస్‌ను వెంటాడుతోంది. తమ సొంత గడ్డపై మొదటి వనే్డలోనే ఓడిపోవడం ఆ జట్టును వెంటాడుతోంది. అయతే నేడు జరిగే మ్యాచ్‌లో తప్పక గెలిచి జట్టులో ఉత్సాహం నింపాలనుకుంటోంది. బ్యాటింగ్‌లో లోపాలను సరిచేసుకుంటూ, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ చివరి ఓవర్ల వర కూ క్రీజులో ఉంటే జట్టు స్కోరు పరుగెత్తడంతో పాటు ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టేలా కీవి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆ జట్టు ఆటగాళ్లు పేర్కొంటున్నారు. మొదటి వనే్డలో బ్యాట్స్‌మెన్లతో పాటు బౌలింగ్ విభాగం కూడా విఫలమైంది. లక్ష్య ఛేదనకు దిగిన భారత్ దాదాపు 36 ఓవర్లు ఆడగా కేవలం రెండు వికెట్లు మాత్రమే నష్టపోయ విజయం సాధించిన విషయం తెలిసిందే.
‘టాప్’ పైనే భారం..
అతిథ్య జట్టు మొత్తం టాప్ ఆర్డర్‌పైనే భారం వేసింది. మొదటి వనే్డలో మొదటి రెండు ఓవర్లలోనే కీలక వికెట్లను కోల్పోవడం, కెప్టెన్ విలియమ్సన్ మినహా మరెవరూ రాణించకపోవడంతో కివీస్ 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. సినీయర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ కూడా విఫలమవడంతో ఏ దశలోనూ కోలుకోలేదు.
జట్టులోకి పాండ్యా..
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆస్ట్రేలియా టూర్‌లో సస్పెన్షన్‌కు గురైన టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టులో చేరనున్నాడు. అయతే సస్పెన్షన్‌కు గురైన పాండ్యా జట్టులో చేరినా తుది జట్టులోకి తీసుకుంటారా లేదా అనేది అనుమానమే. మరోవైపు మొదటి వనే్డలో తమిళనాడు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ బౌలింగ్‌లో పూర్తి స్థాయ ప్రదర్శన ఇవ్వకపోవడం పాండ్యాకు కలిసొచ్చే అంశం.
స్పిన్నర్లే బలం..
మొదటి వనే్డలో కివీస్ వెన్ను విరిచిన కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహాల్ రెండో వనే్డలోనూ కీలకపాత్ర పోషించనున్నారు. ఫాస్ట్ పిచ్‌లపై వీరు బౌలింగ్ అసాధారణం. ఇక మొదటి వనే్డలో ఫాంలోకి వచ్చి రెండు కీలక వికెట్లు తీసుకున్న మహమ్మద్ షమీకి పాండ్యా తోడైతే బౌలింగ్ విభాగంలోనూ భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయంచే అవకాశముంటుంది.