క్రీడాభూమి

భారత్ ఆల్‌రౌండ్ షో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌంట్ మాంగనూయ్, జనవరి 26: న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన రెండో వనే్డలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఆది నుంచే దూకుడుగా ఆడారు. దాదాపు 25 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన ఈ జోడి మొదటి వికెట్‌కు 154 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ 87 (96 బంతుల్లో 6న3, 4న9) వనే్డ కెరీర్‌లో 38 అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, ధావన్ 66 (67 బంతుల్లో 4న9) కెరీర్‌లో 27వ అర్ధ సెంచరీ సాధించాడు. 25.2 ఓవర్‌లో బౌల్ట్ వేసిన బంతిని షాట్ ఆడబోయన ధావన్ లాథమ్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ వచ్చి రాగానే తనకే సాధ్యమైన షాట్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో రోహిత శర్మ 29.3వ ఓవర్‌లో ఫర్గూసన్ వేసిన బంతికి డీ గ్రాండ్‌హోమికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత వచ్చిన అంబటి రాయుడుతో కలిసి కోహ్లీ(43) జట్టు స్కోరును 200 పరుగులు దాటించాడు. ధాటిగా ఆడే క్రమంలో బౌల్ట్ బౌలింగ్‌లో ఇష్ సోదికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అప్పటికీ జట్టు స్కోరు మూడు వికెట్ల నష్టానికి 236 పరుగులు మాత్రమే. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన ధోని (48 నాటౌట్)తో జతకట్టిన రాయుడు (47) ఫెర్గూసన్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆరో బ్యాట్స్‌మన్‌గా వచ్చిన కేదార్ జాదవ్ (22 నాటౌట్) సాయంతో ధోని జట్టు స్కోరును నాలుగు వికెట్ల నష్టానికి 324 పరుగులకు చేర్చాడు. ట్రెంట్ బౌల్ట్, ఫెర్గూసన్‌కు తలో రెండు వికెట్లు దక్కాయ.
324 భారీ పరుగుల భారీ స్కోరును ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 23 పరుగుల వద్ద ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (15) ను భువనేశ్వర్ అవుట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (20)ని షమీ బౌల్డ్ చేశాడు. సీనియర్ బ్యాట్స్‌మన్, ఆల్‌రౌండర్ రాస్ టేలర్‌తో కలిసి మున్రో (31) కాసేపు భారత బౌలర్లను ప్రతిఘటించినా చాహాల్ బౌలింగ్ ఎల్‌బీగా అవుటయ్యాడు. రాస్ టేలర్ (22) ను కేదార్ జాదవ్ బౌలింగ్‌లో ధోని స్టౌంప్ అవుట్ చేయడంతో 100 పరుగులకే నాలుగు కీలక వికెట్లను కోల్పోయ కివీస్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత టామ్ లాథమ్ (34), హెన్రీ నికోలస్ (28), డీ గ్రాండ్‌హోమి (3), ఇష్ సోది (0) కుల్దీప్ పెవిలియన్‌కు పంపి న్యూజిలాండ్ గెలుపు అవకాశాలను దూరం చేశాడు. చివర్లో బ్రాస్‌వెల్ (57) ఒంటరి పోరాటం చేయగా, భువనేశ్వర్ బౌలింగ్ ధావన్ క్యాచ్ పట్టడంతో నిరాశగా వెనుదిరిగాడు. బౌల్ట్ (10) పరుగులతో నాటౌట్ గా నిలవగా, ఫెర్గూసన్ (12)ని చాహాల్ పెవిలియన్‌కు పంపడంతో న్యూజిలాండ్ 40.2 ఓవర్లలో 234 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయంది.
స్కోర్ బోర్డు
భారత్: రోహిత్ శర్మ (సీ) డీ గ్రాండ్‌హోమి, (బీ) లాకీ ఫర్గూసన్ 87; శిఖర్ ధావన్ (సీ) లాథమ్ (బీ) బౌల్ట్ 66; విరాట్ కోహ్లీ (సీ) ఇష్ సోది, (బీ) బౌల్ట్ 43; అంబటి రాయుడు (సీ)(బీ) లాకీ ఫర్గూసన్ 47; ఎంఎస్ ధోనీ 48 (నాటౌట్); కేదార్ జాదవ్ 48 (నాటౌట్). ఎక్స్‌ట్రాలు: 11
మొత్తం: 324 (4 వికెట్లకు 50 ఓవర్లలో)
బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 10-1-61-2, డౌగ్ బ్రాస్‌వెల్ 10-0-59-0, లాకీ ఫర్గూసన్ 10-0-81-2, ఇష్ సోది 10-0-43-0, కొలిన్ డీ గ్రాండ్‌హోమి 8-0-62-0, కొలిన్ మున్రో 2-0-17-0.
న్యూజిలాండ్: మార్టిన్ గప్తిల్ (సీ) చాహాల్ (బీ) భువనేశ్వర్ 15; కొలిన్ మున్రో (ఎల్‌బీ) (బీ) చాహాల్ 31, కేన్ విలియమ్సన్ (బీ) షమీ 20, రాస్ టేలర్ (స్టాంప్) (బీ) కేదార్ జాదవ్ 22, టామ్ లాథమ్ (ఎల్‌బీ) (బీ) కుల్దీప్ యాదవ్ 34, హెన్రీ నికోలస్ (సీ) షమీ (బీ) కుల్దీప్ యాదవ్28, కొలిన్ డీ గ్రాండ్‌హోమి (సీ) రాయుడు (బీ) కుల్దీప్ యాదవ్ 3, డౌగ్ బ్రాస్‌వెల్ (సీ) ధావన్ (బీ) భువనేశ్వర్ 57, ఇష్ సోది (బీ) కుల్దీప్ యాదవ్ 0, లాకీ ఫర్గూసన్ (సీ) విజయ్ శంకర్ (బీ) చాహాల్ 12, ట్రెంట్ బౌల్ట్ 10 (నాటౌట్). ఎక్స్‌ట్రాలు: 2
మొత్తం: 234 (40.2 ఓవర్లలో ఆలౌట్)
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 7-1-42-2, మహ్మద్ షమీ 6-0-43-1, విజయ్ శంకర్ 2-0-17-0, యుజువేంద్ర చాహాల్ 9.2-0-52-2, కేదార్ జాదవ్ 6-0-35-1, కుల్దీప్ యాదవ్ 10-0-45-4.