క్రీడాభూమి

విండీస్ భారీ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిడ్జిటౌన్, జనవరి 27: కొన్నాళ్లుగా వరుస ఓటములతో సతమతమవుతున్న వెస్టిండీస్ ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో భారీ విజయాన్ని అందుకుంది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో రాణించి మునుపటి ఆట తీరును గుర్తుకు తెచ్చింది. బ్రిడ్జిటౌన్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ షాయ హోప్ (57), రోస్టన్ చేస్ (54), షిమ్రాన్ హిట్మయర్ (81) రాణించడంతో మొదటి ఇన్నింగ్స్‌లో 289 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 5, బెన్ స్టోక్స్ 4, మొయన్ అలీ 1 వికెట్ తీశారు. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు విండీస్ బౌలర్ల ధాటికి కేవలం 77 పరుగులకే ఆలౌట్ అయంది. కిమన్ రోచ్ 5, జాసన్ హోల్డర్, అల్జార్రి జోసెఫ్ తలో రెండు, షానాన్ గబ్రియెల్ ఒక వికెట్ తీసుకున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో 212 పరుగుల ఆధిక్యం సంపాదించిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ జాసన్ హోల్డర్ (202)కి తోడు షానె డారీచ్ సెంచరీ చేయడంతో ఐదు వికెట్లు కోల్పోయ 415 పరుగుల వద్ద డిక్లెర్డ్ చేసింది. 628 పరుగుల లక్ష్య ఛేదనకు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు 246 పరుగులకే కుప్పకూలింది. దీంతో వెస్టిండీస్ 381 భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది. విండీస్ బౌలర్లలో రోస్టన్ చేస్ 8 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు.
చిత్రం.. రోస్టన్ చేస్ 8/60