క్రీడాభూమి

‘ఆస్ట్రేలియా’ కింగ్ జొకోవిచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 27: ప్రపంచ నెంబర్ వన్ హోదాలో, టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన సెర్బియా ఆటగాడు నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియా గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో అతను ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు రాఫెల్ నాదల్‌ను 6-3, 6-2, 6-3 తేడాతో ఓడించాడు. కెరీర్‌లో అతనికి ఇది 15వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌గా ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఏడవది. నిజానికి ఈ ఫైనల్ హోరాహోరీగా సాగుతుందని అంతా ఊహించారు. కానీ, అందుకు భిన్నంగా, దాదాపు ఏకపక్షంగా ముగిసింది. క్లే, హార్డ్ కోర్టులపై విజృంభించే నాదల్‌కు ఆస్ట్రేలియా ఓపెన్ అచ్చిరాలేదని మరోసారి రుజువైంది. 2009లో ఈ టైటిల్ గెల్చుకున్న అతను మరోసారి విజయభేరి మోగించడానికి చేసిన ప్రయత్నం ఫలింలేదు. ఈ టోర్నమెంట్ తొలి రౌండ్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగిన జేమ్స్ డక్‌వర్‌తను 6-4, 6-3, 7-5 తేడాతో ఓడించిన నాదల్ ఆ తర్వాత వరుసగా మాథ్యూ ఎబ్డెన్ (6-3, 6-2, 6-2), అలెక్స్ డి మినౌర్ (6-1, 6-2, 6-4), థామస్ బెర్డిచ్ (6-0, 6-1, 7-6)పై విజయాలు నమోదు చేసి క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. అక్కడ ఫ్రాన్సిస్ తియాఫోను 6-3, 6-4, 6-2 ఆధిక్యంతో ఓడించాడు. సెమీ ఫైనల్లో స్ట్ఫోనొ సిట్సిపాస్‌పై 6-2, 6-4, 6-0 స్కోరుతో గెలుపొంది జొకోవిచ్‌తో తుది పోరును ఖరారు చేసుకున్నాడు. అయితే, తుది పోరులో తడబడి, రన్నరప్ ట్రోఫీతో సరిపుచ్చుకున్నాడు.
ఈ టోర్నీ మొత్తం దూకుడుగా ఆడిన జొకోవిచ్ తొలి రౌండ్‌లో క్వాలిఫయర్ మిచెల్ క్రూగెర్‌ను 6-3, 6-2, 6-2 స్కోరుతో ఓడించాడు. అనంతరం అతను జో విల్‌ఫ్రైడ్ సొంగా (6-3, 7-5, 6-4), డానిస్ షెపొవలోవ్ (6-3, 6-4, 4-6, 6-0), డానిల్ మెద్వెదెవ్ (6-4, 6-7, 6-2, 6-3)పై విజయాలు సాధించి క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు. ఈ దశలో అత్యంత ప్రమాదకరమైన ఆటగాడు కెయ్ నిషికోరి అతని దూకుడుకు అడ్డుతగిలే ప్రమాదం కనిపించింది. అయితే, జొకోవిచ్ తేతిలో తొలి సెట్‌ను 1-6 తేడాతో కోల్పోయి, రెండో సెట్‌లో 1-4 తేడాతో వెనుకబడి ఉన్న సమయంలో, కండరాలు బెణకడంతో ఆటను కొనసాగించలేకపోయాడు. దీనితో జొకోవిచ్‌కు సెమీస్‌లో చోటు దక్కింది. టైటిల్‌పై కనే్నసిన అతను లుకాస్ పౌలీని 6-0, 6-2, 6-2 తేడాతో చిత్తుచేశాడు. తుది పోరులోనూ అదే దూకుడును కొనసాగించి, నాదల్‌ను వరుస సెట్లలో ఓడించి, టైటిల్ అందుకున్నాడు.
చిత్రం.. ట్రోఫీని ముద్దాడుతున్న జొకోవిచ్