క్రీడాభూమి

కివీస్‌పై మహిళల జట్టు విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌంట్ మాంగనూయ్, జనవరి 29: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వనే్డలో ఓపెనర్ స్మృతి మంధాన, కెప్టెన్ మిథాలీ రాజ్ రాణించడంతో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టులో కెప్టెన్ సాటర్‌వెయట్ (71) మినహా మరెవ్వరూ రాణించిక పోవడంతో 44.2 ఓవర్లలోనే 161 పరుగులకు ఆలౌట్ అయంది. భారత బౌలర్లలో సినీయర్ బౌలర్ జులన్ గోస్వామి మూడు, ఏక్తా బిష్త్, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్ తలో రెండు వికెట్లు తీయగా, షీకా పాండే కు ఒక వికెట్ దక్కింది. ఆ తర్వాత 162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన భారత్ జెమీమా రోడ్రిగ్స్ (0) పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్‌గా వెనుదిరిగింది. దీంతో క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ (8) కూడా నిరాశ పరచడంతో, మరో ఓపెనర్ స్మృతి మంధాన (90) కెప్టెన్ మిథాలీ రాజ్ (63)తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో వీరిద్దరూ అర్ధ సెంచరీలు సాధించారు.
మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ మరో 88 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించారు. న్యూజి లాండ్ బౌలర్లలో లియా తహుహు, అన్నా పీటర్‌సన్‌కు చెరో వికెట్ తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ స్మృతి మంధానకు దక్కింది. హమిల్టన్ వేదికగా మూడో వనే్డ జరగనుంది.
చిత్రం. మంధాన (90)