క్రీడాభూమి

ఒకే ఏడాది..ఒకేదేశంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, జనవరి 29: రెండు టోర్నీలు.. 22 జట్లు.. 13 వేదికలు.. 68 మ్యాచ్‌లు ఒకే ఏడాది, ఒకే దేశంలో..! అవును.. ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది మహిళా, పురుషుల టీ20 ప్రపంచకప్ టోర్నీలను ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) నిర్వహించనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను మంగళవారం అధికారికంగా ప్రకటించింది. మొదట మహిళా, అనంతరం పురుషుల టీ20 టోర్నీ ఆరంభం కానుంది. ఈ సూపర్ టోర్నీల్లో మహిళల ప్రపంచకప్ టోర్నీలో 10 జట్లు పాల్గొంటుండగా, 2020 ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు నిర్వహించనుంది. అలాగే పురుషుల టోర్నీలో 12 జట్లు పాల్గొంటుండగా, అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు జరగనుంది.
ఉమెన్స్ షెడ్యూల్..
మహిళల టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. గ్రూప్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3 వరకు జరుగుతాయ. మార్చి 5న సెమీ ఫైనల్స్ నిర్వహించనుండగా, ఫైనల్ మ్యాచ్ మార్చి 8న (అంతర్జాతీయ మహిళా దినోత్సవం) మెల్‌బోర్న్ వేదికగా జరగనుంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరగనుంది. మొత్తం 23 మ్యాచ్‌లు జరగనున్నాయ.
గ్రూప్ ఏ : ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్, శ్రీలంక, క్వాలిఫయర్ 1
గ్రూప్ బీ: ఇంగ్లాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, క్వాలిఫయర్ 2
పురుషుల షెడ్యూల్..
పురుషుల టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు జరగనుంది. ఫైనల్‌తో కలిపి మొత్తం 45 మ్యాచ్‌లు జరుగుతాయ. తొలి మ్యాచ్ సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య జరగనుంది. క్వాలిఫయర్ మ్యాచ్‌ల తర్వాత అక్టోబర్ 24 నుంచి నవంబర్ 8 వరకు గ్రూపు మ్యాచ్‌లు నిర్వహిస్తారు. నవంబర్ 11, 12 తేదీల్లో సెమీ ఫైనల్స్, 15న ఫైనల్ మెల్‌బోర్న్‌లో జరగనుంది.
గ్రూప్-ఏ: పాకిస్థాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, న్యూజిలాండ్, రెండు క్వాలిఫయర్ జట్లు
గ్రూప్-బీ: భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆప్గానిస్థాన్, రెండు క్వాలిఫయర్ జట్లు
ఫిబ్రవరి 21 నుంచి టికెట్ల అమ్మకాలు
మహిళల ప్రపంచకప్ టోర్నీ టికెట్లను ఈ ఏడాది 21నుంచే అమ్మకాలు ప్రారంభించనున్నట్లు ఐసీసీ తెలిపింది. దీనికోసం లోకి ఆ20త్యీజూషఖఔ.ష్యౄ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండు టోర్నీల ప్రత్యక్ష ప్రసారాల హక్కులను స్టార్ స్పోర్ట్స్ దక్కించుకుంది.
*
మహిళల టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లు..

ఫిబ్రవరి 21: ఆస్ట్రేలియా న భారత్ (సిడ్నీ)

ఫిబ్రవరి 24: భారత్ న క్వాలిఫయర్ 1 (వాఖా)

ఫిబ్రవరి 29: భారత్ న శ్రీలంక (జంక్షన్ ఓవల్)

ఫిబ్రవరి 29: భారత్ న శ్రీలంక (జంక్షన్ ఓవల్)
*
పురుషుల టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లు..

అక్టోబర్ 24: భారత్ న దక్షిణాఫ్రికా (పెర్త్)
అక్టోబర్ 29: భారత్ న క్వాలిఫయర్ 2 (మెల్‌బోర్న్)

నవంబర్ 1: భారత్ న ఇంగ్లాండ్ (మెల్‌బోర్న్)

నవంబర్ 5: భారత్ న క్వాలిఫయర్ 1 (అడిలైడ్)

నవంబర్ 8: భారత్ న అప్గానిస్థాన్ (సిడ్నీ)
*
చిత్రం.టీ20 ప్రపంచకప్‌ల షెడ్యూల్‌ను ప్రకటిస్తున్న నిర్వాహకులు