క్రీడాభూమి

భారత్‌తో టీ20కి కివీస్ జట్టులో మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, జనవరి 30: వచ్చే నెల 6 నుంచి భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ కొన్ని మార్పులు చేసింది. ఇద్దరు కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నట్లు కెప్టెన్ కేన్ విలియయ్సన్ పేర్కొన్నాడు. ఇప్పటికే భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో న్యూజిలాండ్ 3-0తో వెనుకబడిన విషయం తెలిసిందే. అయతే కివీస్ టీ20కి 14 మంది సభ్యులు గల బలమైన జట్టును ఆడించే యోచనలో ఉంది. జట్టులోకి వచ్చిన కొత్త ఆటగాళ్లలో ఆల్ రౌండర్ డెరియల్ మిచెల్, పేసర్ బ్లయర్ టిక్‌నర్‌తో పాటు ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20లో రాణించిన జిమ్మి నిషమ్‌ను కూడా తీసుకోనున్నారు. న్యూజిలాండ్ డొమెస్టిక్ టీ20 లీగ్ సూపర్ స్మాష్‌లో మిచెల్ నార్తర్న్ నైట్స్‌పై 23 బంతుల్లో 61 పరుగులు చేయగా, సెంట్రల్ స్టాగ్స్‌పై రాణించాడు. అలాగే లాకీ ఫెర్గూసన్ స్థానంలో వస్తున్న టిక్‌నర్ సైతం డొమెస్టిక్ టోర్నీల్లో రాణించినట్లు న్యూజిలాండ్ జట్టు సెలక్టర్ గావిన్ లార్సన్ తెలిపాడు. కాగా, సీమర్ లాకీ ఫెర్గూసన్ మొదటి రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుండగా, టిక్‌నర్ అతడి స్థానంలో మూడో మ్యాచ్ ఆడనున్నాడు. మరోవైపు టీమిండియాలో కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతి కల్పించడంతో వనే్డలో రెండు మ్యాచ్ లు, టీ20 సిరీస్‌లకు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిం చనున్నాడు.
న్యూజిలాండ్ టీ20 జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డౌగ్ బ్రాస్‌వెల్, కొలిన్ డీగ్రాండ్‌హోమీ, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్తిల్, స్కాట్ కుగ్గేలైజన్, డెరియల్ మిచెల్, కొలిన్ మున్రో, మిచెల్ సాంత్నార్, టిమ్ సీఫార్ట్ (వికెట్ కీపర్), ఇష్ సోదీ, టిమ్ సౌథీ, రాస్ టేలర్, బ్లయర్ టిక్‌నర్.