క్రీడాభూమి

కోలుకుంటున్న మాజీ క్రికెటర్ మార్టిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడోదర, జనవరి 30: తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న భారత జట్టు మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్ కోలుకుంటున్నట్లు శిశిర్ హట్టంగడీ ట్వీట్ చేశాడు. గత డిసెంబర్‌లో ప్రమాదానికి గురైన మార్టిన్‌కు ఊపిరితిత్తులు, కాలేయం దెబ్బతినడంతో ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. అయతే ప్రస్తుతం తనకు తానుగానే శ్వాస తీసుకుంటుండడంతో ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించారు. మార్టిన్ ప్రమాదానికి గురైన వెంటనే ఆయన కుటుంబం డబ్బుల కోసం తీవ్రంగా ఇబ్బందులు పడింది. దీంతో పలువురు క్రికెటర్లతో పాటు బీసీసీఐ, బరోడా క్రికెట్ అసోసియేషన్ సాయం చేసింది. మార్టిన్ ప్రమాదానికి గురై చికిత్సకు డబ్బులు అవసరం ఉందనే సమాచారం తెలిసిన వెంటనే మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, యూసుఫ్ పఠాన్, జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా, కృనాల్ పాండ్యా, మునఫ్ పటేల్ తదితరులు తమ వంతుగా సాయం అం దించారు. ఇప్పటివరకు ఆస్పత్రి ఖర్చులు రూ.15 లక్షలు కాగా, రూ.16 లక్షలు సాయంగా అందాయి. అయతే మరి కొన్ని రోజులు మార్టిన్ ఆస్పత్రిలోనే ఉండాల్సి రావడంతో మరికొన్ని డబ్బులు అవసరం కావాల్సి ఉంటాయి.