క్రీడాభూమి

జట్టుకు ధోనీ అదనపు బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: టీమిండి యా సినీయర్ క్రికెటర్, మాజీ కెప్టెన్ మహీంద్రసింగ్ ధోనీ జట్టకు అదనపు బలమని, తప్పకుండా ప్రపంచకప్‌లో ఆడించాలని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్, వే ల్స్ సంయుక్తంగా నిర్వహించే 2019 ప్రపంచకప్ మే 30 నుంచి జూన్ 14 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ప్రపం చ కప్ తన కలల జట్టును ప్రకటిం చాడు. అంతేకాకుండా జట్టులో ఎవ రుంటే బాగుంటుంది.. ఎవరు ఏ స్థానంలో ఆడితే జట్టుకు ప్రయోజన కరంగా ఉండనుందనే 15మంది సభ్యులు గల జట్టును ప్రకటించాడు.
అశ్విన్‌కు అవకాశం..
మొతం 15మందితో కూడిన తన కలల జట్టులో గంభీర్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు కల్పిం చాడు. అంతేకాకుండా ఇటీవల మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న హార్దిక్ పాం డ్యా, కేఎల్ రాహుల్‌లకు సైతం జట్టులో అవకాశమిచ్చాడు.
ఓపెనర్లుగా వారిద్దరే..
అన్ని వనే్డ ఫార్మట్లలాగే ప్రపంచ కప్‌కు భారత ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ కొనసాగాలని, మూడో స్థానంలో కేఎల్ రాహుల్, నాలుగో స్థానంలో విరాట్‌కోహ్లీ వస్తే బాగుంటుందని సూచించాడు.
వారికి చోటు లేనట్లే..
ఆస్ట్రేలియా పర్యటనలో రాణించి న యువ వికెట్ కీపర్ రిషభ్‌పంత్ , ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్, ఉమేశ్ యాదవ్, పృథ్వీ షాలు గంభీర్ కలల జట్టులో అవకాశం దక్కించుకోలేకపోయారు.
గంభీర్ ప్రకటించిన జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బూమ్రా, భువనేశ్వ ర్ కుమార్, మహ్మద్ షమీ, యుజు వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్.