క్రీడాభూమి

ఐదు దశాబ్దాల కల నెరవేరేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్: ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా, మరో రికార్డులో చేరువైంది. ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్‌ను 2-1తో నెగ్గినా కోహ్లీ సేన, అద్భుత ప్రదర్శనతో వనే్డ సిరీస్‌ను సైతం చేజిక్కించుకుంది. ఆ తర్వాత న్యూజిలాండ్ పర్యటనలోనూ వరుస విజయాలతో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే వనే్డ సిరీస్ నెగ్గింది. అయతే 1967 నుంచి న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న భారత జట్టు ఐదు దశాబ్దాల్లో 4-0 తేడాతో ఇప్పటివరకు విజయాన్ని అందుకోలేదు. ప్రస్తుతం టీమిండియాను ఆ రికార్డు ఊరిస్తోంది. నేడు హామిల్టన్ వేదికగా జరిగే మ్యాచ్‌ను రోహిత్ సేన గెలిస్తే ఐదు దశాబ్దాల కల నెరవేరనుంది. 2008-09 పర్యటనలో మహీంద్ర సింగ్ ధోనీ సారథ్యం వహించగా భారత్ 3-1 తేడాతో విజయాన్ని అందుకుంది.
రోహిత్‌కు 200వ వనే్డ..
టీమిండియా హిట్టర్ రోహిత్ శర్మకు న్యూజిలాండ్‌తో జరిగే నాలుగో వనే్డ కెరీర్‌లో 200వ వనే్డ మ్యాచ్. 31 ఏళ్ల రోహిత్ తన మొదటి వనే్డను 2007లో బెల్ ఫాస్ట్ వేదికగా ఐ ర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో ఆరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 199 వనే్డ మ్యాచ్‌లాడిన ఈ హిట్ మ్యాన్ 7799 పరగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 39 అర్ధ సెంచరీలు న్నాయ. 200వ వనే్డ మ్యాచ్ ఆడుతున్న రోహిత్ తనే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
మూడుసార్లు ‘డబుల్’
కెరీర్ 199 వనే్డ మ్యాచ్‌లాడిన రోహిత్ శర్మ మూడు సార్లు డబుల్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఘనత మరే క్రికెటర్‌కు సాధ్యపడలేదు. మూడు డబుల్ సెంచరీల్లో 2013 బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 209, ఆ తర్వాతి ఏడాదే (2014) కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 264 పరుగులు చేశాడు. రోహిత్ కెరీర్, వనే్డ కెరీర్‌లో ఇవే అత్యుత్తమ పరుగులు. మూడో డబుల్ సెంచరీని 2017 మోహలీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 208 పరుగులు సాధించాడు. శ్రీలంకపైనే రెండు డబుల్ సెంచరీలు సాధించడం విశేషం.
కోహ్లీ స్థానంలో శుభ్‌మాన్ గిల్
వరుస మ్యాచ్‌లాడుతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు రానున్న ప్రపంచ కప్ దృష్ట్యా విశ్రాంతిని కల్పించారు. న్యూజిలాండ్‌తో ఐదు వనే్డల సిరీస్‌ను, మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే భారత్ 3-0తో గెలుచుకోవడంతో మిగతా రెండు వనే్డలు, టీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకోను న్నాడు. అయతే కోహ్లీ స్థానంలో అండర్-19 ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ను ఆడించాలని సెలక్టర్లు భావిస్తున్నారు. అండర్-19 ప్రపంచ కప్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. శుభ్‌మన్ గిల్‌ను ఆడించే విషయమై మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, సునీల్ గవాస్కర్ కూడా బీసీసీఐకి సూచించారు.
చిత్రాలు.. రోహిత్ శర్మ *నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో మహీంద్ర సింగ్ ధోనీ