క్రీడాభూమి

ఆస్ట్రేలియా భారీ స్కోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్‌బెర్రా, ఫిబ్రవరి 1: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మొదటిరోజు ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నాలుగో ఓవర్‌లోనే ఓపెనర్ మార్కస్ హారిస్ (11) వికెట్‌ను కోల్పోయంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖాజా (0), మముస్ లాబుస్‌చెంజ్ (6) తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరడంతో మూడు వికెట్లు కోల్పోయ, 28 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్‌తో కలిసి మరో ఓపెనర్ జో బర్న్స్ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ఈ క్రమంలోనే సెంచరీ సాధించారు. ఆ తర్వాత హెడ్ (161) విశె్వఫెమండో బౌలింగ్ ఎల్‌బీగా అవుటవడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. వీరిద్దరూ కలిసి 308 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మరోవైపు క్రీజులోకి వచ్చిన కర్టీస్ ప్యాటర్‌సన్ (25)తో కలిసి జో బర్న్స్ (172) క్రీజులోనే ఉండడంతో మొదటిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయ 383 భారీ స్కోరును సాధించింది. శ్రీలంక బౌలర్లలో విశ్వఫెమండో మూడు, చమిక కరుణరత్నేకు ఒక వికెట్ దక్కింది.
113 రోజుల తర్వాత సెంచరీ
113 రోజుల తర్వాత ఆస్ట్రేలియా తరఫున సెంచరీ నమోదు కావడం విశేషం. ఇటీవల భారత్‌తో టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు ఒక్క సెంచరీ కూడా నమోదు చేయకపోవడం విశేషం. చివరిగా గతేడాది అక్టోబర్‌లో దుబాయ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉస్మాన్ ఖాజా (141) సెంచరీ సాధించాడు. జట్టు తరఫున ఒక్క సెంచరీ నమోదు చేయడానికి మూడు నెలల సమయం పట్టడం ఆస్ట్రేలియాకు ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
స్కోరుబోర్డు..
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: మార్కస్ హారిస్ (సీ) కరుణరత్నే (బీ) విశ్వఫెమండో 11, జో బర్న్స్ (బ్యాటింగ్) 172, ఉస్మాన్ ఖాజా (సీ) కుశల్ మెండీస్ (బీ) విశ్వఫెమండో 0, మముస్ లాబుస్ చెంజ్ (సీ) డిక్వెల్లా (బీ) కరుణరత్నే 6, ట్రావిస్ హెడ్ (ఎల్‌బీ) (బీ) విశ్వఫెమండో 161, కర్టీస్ ప్యాటర్‌సన్ (బ్యాటింగ్) 25.
ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 384 (87 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి..)
బౌలింగ్: కసున్ రజిత 20-5-67-0, విశ్వఫెమండో 20-2-99-3, చమిక కరుణరత్నే 14-0-87-1, దిల్‌రువాన్ పెరీరా 19-0-90-0, ధనుంజయ డిసీల్వా 14-2-40-0.