క్రీడాభూమి

క్రీడలకు ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: గతంతో పోలిస్తే క్రికెట్‌కు కేంద్రం మరింత ఊతమివ్వనుంది. అనారోగ్యంతో బాధపడుతూ, వైద్య పరీక్షలకు వెళ్లిన అరుణ్ జైట్లీ స్థానంలో కేంద్ర ఆర్థిక శాఖను తాత్కాలికంగా నిర్వహిస్తున్న పీయూష్ గోయల్ శుక్రవారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో క్రీడలకు సముచిత స్థానం లభించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన ఈ బడ్జెట్‌లో క్రీడలకు ప్రస్తుతంతో పోలిస్తే 214.20 కోట్ల రూపాయలను అధికంగా కేటాయించారు. ఇంతకు ముందు 2,002.72 కోట్ల రూపాయలుగా ఉన్న క్రీడా బడ్జెట్‌ను 2,216.92 కోట్ల రూపాయలకు పెంచారు. ఈ కేటాయింపుల్లో భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్), జాతీయ క్రీడాభివృద్ధి నిధి (ఎన్‌ఎస్‌డీఎఫ్)కు అధిక ప్రాధాన్యం దక్కింది. సాయ్‌కి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన మొత్తం 395 కోట్ల రూపాయలుకాగా, దానిని మరో 55 కోట్ల రూపాయలు పెంచి, 450 కోట్ల రూపాయలకు ఖరారు చేశారు. అదే విధంగా ఎన్‌ఎస్‌డీఎఫ్ మొత్తాన్ని రెండు కోట్ల నుంచి 70 కోట్ల రూపాయలకు పెంచారు. కాగా, జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్)లకు కేటాయింపుల్లో స్వల్పంగా కోత పడింది. ప్రస్తుతం 245.13 కోట్ల రూపాయలుకాగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి 0.13 శాతం తగ్గించి, 245 కోట్ల రూపాయలుగా నిర్ధారించారు.