క్రీడాభూమి

అమ్మాయలూ ఓడారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్, ఫిబ్రవరి 1: వరుసగా రెండు వనే్డల్లో రాణించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా మహిళా జట్టు, శుక్రవారం జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో పరాజయం పాలైంది. అంతకుముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ మహిళల జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత ఓపెనర్లు జెమీమా, స్మృతి మంధాన నెమ్మదిగా ఇ న్నింగ్స్ ప్రారంభించినా, స్మృతి మంధాన (1)ని అన్నా పీటర్‌సన్ సింగిల్ డిజిట్‌కే పెవిలియన్‌కు పంపింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మతో కలిసి మరో ఓపెనర్ జెమీమా (12) స్కోరు బోర్డును పరుగెత్తించే క్రమంలో తహుహు బౌలింగ్‌లో అమేలియాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత దీప్తి శర్మకు తోడైన కెప్టెన్ మిథాలీ రాజ్ 28 బంతులాడి కేవలం 9 పరుగులు మాత్రమే చేసి కాస్పర్క్ బౌలింగ్‌లో పర్కిన్స్‌కు క్యాచ్ ఇచ్చింది. 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయనా మరోవైపు దీప్తి శర్మ స్కోరు బోర్డును పరుగెత్తించే బాధ్యత తీసుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి చూడచక్కని బౌండరీలతో అలరించింది. కొద్దిసేపటికే హర్మన్‌ప్రీత్ (24) అన్నా పీటర్‌సన్ బౌలింగ్ వికెట్ల ముందు దొరికిపోయంది. ఈ క్రమంలో దీప్తీ శర్మ (52) రైండా అన్నా పీటర్‌సన్ బౌలింగ్‌లోనే అవుటయంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన థనియా భ టియా (0), షికా పాండే (8), ఏక్తా బిష్త్ (3), పూనమ్ పాండే (1), జులన్ గోస్వామి (12) నాటౌట్ పెద్దగా రాణించకపోవడంతో 44 ఓవర్లలో 149 పరుగులకే భారత్ కుప్పకూలింది. న్యూజిలాండ్ బౌలర్లలో అన్నా పీటర్‌సన్ నాలుగు, లియా తహుహు మూడు, అమేలియా కెర్ 2, లిఘా కాస్పర్క్ 1 వికెట్ తీసుకున్నారు. 150 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ మొదటి నుంచి ధాటిగా ఆడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో లారెన్ డాన్ (10)ని గోస్వామి రనౌట్ చేయడంతో కివీస్ మొదటి వికెట్‌ను కోల్పోయంది. ఆ క్రీజులోకి వచ్చిన అమీ సట్టేర్త్‌వైట్‌తో కలిసి మరో ఓపెనర్ సుజీ బేట్స్ వేగంగా పరగులు రాబట్టింది. ఈ క్రమంలో వీరిద్దరూ అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం బేట్స్ (57)ను పూనమ్ పాండే బౌల్ డ చేసింది. దీంతో క్రీజులోకి వచ్చిన సోపీ డివైన్ (17)తో కలిసి అమీ సట్టేర్త్‌వైట్ (66) మరో వికెట్ పడకుండా కేవలం 29.2 ఓవర్లలోనే జట్టును గెలిపించారు. భారత బౌలర్లలో పూనమ్ పాండేకు మాత్రమే వికెట్ లభించింది. సిరీస్‌ను భారత్ 2-1తో గెలుచుకుంది. సిరీస్‌లో రాణించిన స్మృతీ మంధానకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.
మిథాలీ బ 200
చిన్న వయసులోనే క్రికెట్‌లో ఆరంగేట్రం చేసి ఎన్నో ఘనతలు అందుకున్న టీమిండియా ఉమెన్స్ కెప్టెన్ మిథాలీ రాజ్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచ మహిళా క్రికెట్‌లో 200వ వనే్డ ఆడి ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన మూడో వనే్డలో ఈ మార్క్‌ను చేరుకుంది. 36 ఏళ్ల మిథాలీ రాజ్ వనే్డల్లో 51.33 సగటుతో 6622 పరుగులు చేసింది. భారత్ ఇప్పటివరకు 263 వనే్డలు ఆడగా, 200 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించింది. 200వ మ్యాచ్ సందర్భంగా పలువురు మిథాలీని అభినందించారు. కాగా, చివరి వనే్డలో మిథాలీరాజ్ 28 బంతులు ఎదుర్కొని 9 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచింది.