క్రీడాభూమి

భారత్ నెం.2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్: ఐసీసీ (అంతర్జాతీ య క్రికెట్ కౌన్సిల్) సోమవారం వనే్డ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఇటీవల ఆస్ట్రేలి యా, న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ల్లో రాణిం చిన టీమిండియా 122 పాయంట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ 126 పా యంట్లతో మొదటిస్థానంలో ఉండగా, దక్షిణా ఫ్రికా, న్యూజిలాండ్ 111 పాయంట్లతో మూ డు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయ. 102 పాయంట్లతో ఐదో స్థానంలో పాకిస్థాన్, 100 పాయంట్లతో ఆరో స్థానంలో ఆస్ట్రేలియా, 93 పాయంట్లతో బంగ్లాదేశ్ ఏడో స్థానంలో కొనసాగుతుండగా, 78 పాయంట్లతో శ్రీలంక ఎనిమిది, 72 పాయంట్లతో వెస్టిండీస్ తొమ్మిది, 67 పాయంట్లతో ఆఫ్గానిస్థాన్ పది స్థానాల్లో నిలిచాయ. ఇక యూఏఈపై సిరీస్ గెలిచిన నేపాల్ మొదటిసారిగా 15 పాయంట్లతో 15వ స్థానంలో నిలిచింది. బ్యాట్స్‌మెన్ల విభాగంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 922 పా యంట్లతో మొదటి స్థానంలో నిలవగా, 854 పాయంట్లతో రెండో స్థానంలో రోహిత్ శర్మ, 821 పాయంట్లతో మూడో స్థానంలో న్యూజి లాండ్ ఆటగాడు రాస్ టేలర్, 807 పాయం ట్లతో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్, ఆ తర్వా తి స్థానాల్లో బాబర్ ఆజమ్ (801), ఫాఫ్ డూప్లె సిస్ (791), షాయ హోప్ (780), క్వాంటన్ డీకాక్ (758), ఫాఖర్ జమాన్ (755), శిఖర్ ధావన్ (744) ఉన్నారు. బౌలింగ్ విభాగంలో భారత్‌కు చెందిన యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా 808 పాయంట్లతో అగ్రస్థానంలో ఉం డగా, ఆఫ్గానిస్తాన్‌కు చెందిన స్పిన్నర్ రషీద్ ఖాన్ 788 పాయంట్లతో రెండో స్థానంలో కొన సాగుతున్నాడు. కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 732 పాయంట్లతో మూడో స్థానంలో ఉండగా, భారత్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 719 పాయంట్లతో నాలుగు, యుజువేంద్ర చాహాల్ ఐదో స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఆ తర్వా తి స్థానాల్లో బంగ్లాదేశ్‌కు చెందిన ముస్తాఫిజుర్ రహమన్ (695), దక్షిణాఫ్రికాకు చెందిన కగిసో రబడా (688), ఇంగ్లాండ్‌కు చెందిన అదిల్ రషీద్ (683), ఆఫ్గానిస్తాన్‌కు చెందిన ముజిబ్ ఉర్ రహమన్ (679), ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హజెల్‌వుడ్ టాప్ 10లో చోటు దక్కించు కున్నారు.

చిత్రాలు..విరాట్ కోహ్లీ *రోహిత్ శర్మ* జస్ప్రీత్ బూమ్రా