క్రీడాభూమి

ఒలింపిక్స్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉండాలని ప్రతిపాదనేదీ రాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 10: రియో ఒలింపిక్స్‌లో మన దేశానికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉండాలని తనను ఎవరూ కోరలేదని, అసలు అలాంటి ప్రతిపాదనేదీ తన వద్దకు రాలేదని ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఎఆర్ రహ్మాన్ స్పష్టం చేశాడు. ఒలింపిక్స్ గుడ్‌విల్ అంబాసిడర్స్‌గా సల్మాన్ ఖాన్, సచిన్ తెండూల్కర్‌లను భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) నియమించిన విషయం తెలిసిందే. రహ్మాన్‌కు కూడా ఐఒఎ నుంచి ఆహ్వానం వెళ్లిందని, కానీ, దానిని అతను తిరస్కరించాడని వార్తలు వచ్చాయి. దీనిపై రహ్మాన్ వివరణ ఇస్తూ, తనను ఎవరూ సంప్రదించలేదని తెలిపాడు.
పీలేతో పోలిక
బ్రెజిల్ ‘లెజెండరీ’ ఫుట్‌బాలర్ పీలే జీవితంతో తన జీవితానికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని రహ్మాన్ అన్నాడు. తన తండ్రి కూడా సంగీత దర్శకుడేనని, కానీ, ఆయన లక్ష్యాన్ని చేరకుండానే కన్ను మూశాడని చెప్పాడు. ఆయన కలలు నిజం చేయడానికి కృషి చేస్తున్నానని అన్నాడు. అదే విధంగా పీలే తండ్రి కూడా ఫుట్‌బాలర్‌గా ఎదగాలని కోరుకున్నా, పరిస్థితులు అందుకు సహకరించలేదని చెప్పాడు. తండ్రి ఆశలకు పీలే ఊపిరిపోశాడని అన్నాడు. పీలే జీవితంపై నిర్మిస్తున్న ‘పీలే: బర్త్ ఆఫ్ ఎ లెజెండ్’
సినిమాకు సంగీత దర్శకత్వం వహించే అవకాశం దక్కడం తన అదృష్టమని అన్నాడు. అదే విధంగా భారత మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ జీవిత కథా చిత్రానికి కూడా తానే సంగీతం అందిస్తున్నానని చెప్పాడు.