క్రీడాభూమి

జట్టులో కుల్దీప్ నెంబర్ వన్ స్పిన్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, ఫిబ్రవరి 5: ‘కుల్దీప్ అంతర్జాతీయ మ్యాచుల్లో అద్భుతం గా రాణిస్తున్నాడు. అతడికే మా మొ దటి ప్రాధ్యాన్యత. జట్టులో ఒకే స్పిన్నర్‌ని తీసుకునే అవకాశం ఉంటే కుల్దీప్‌నే తీసుకుంటాం’ అని టీమిం డియా హెడ్ కోచ్ రవిశాస్ర్తీ స్పష్టం చేశాడు. మంగళవారం రవిశాస్ర్తీ క్రిక్ బజ్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ కుల్దీప్ యాదవ్ జట్టు సినీయర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కంటే మెరుగైన బౌలర్ అని కొని యాడారు. ఇటీవలి కాలంలో విదేశా ల్లో కుల్దీప్ ప్రదర్శన చూస్తే అర్థమ వుతందని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా తో సిడ్నీ వేదికగా జరిగిన టెస్టులో కుల్దీప్ ఐదు వికెట్లు పడగొట్టిన విష యం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావించిన రవిశాస్ర్తీ ప్రస్తుతానికి మాకు కుల్దీప్ యాదవ్ నెం. 1 బౌలర్ అని పునరుద్ఘటించాడు.