క్రీడాభూమి

పొట్టి సిరీస్‌పై కన్ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్: వరుసగా సిరీస్‌లు నెగ్గి జోరుమీదున్న టీమిండియా న్యూజిలాండ్‌తో నేటి నుంచి జరిగే పొటి ట సిరీస్ (టీ20)పై కనే్నసింది! ఇటీవల జరిగిన వనే్డ సిరీస్‌ను 4-1తో నెగ్గిన భారత్, మూడు మ్యాచ్‌ల టీ20ని సైతం గెలుచుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ జట్టులో చేరడంతో భారత్ మరింత బలంగా కనిపిస్తోంది. దీంతో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోయనా సిరీస్‌ను గెలుస్తామనే ధీమాగా ఉంది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్‌తో జరిగిన చివరి రెండు వనే్డల్లో బ్యాటింగ్‌లో విఫలమైనా టీ20లో ఘనమైన రికార్డే ఉంది. శిఖర్ ధావన్, మహేంద్రసింగ్ ధోనీ, రిషభ్ పంత్, దినేష్ కార్తీక్ తో ఇటు టాప్ ఆర్డర్, అటు మిడిలార్డర్ బలంగా కనిపిస్తోంది. చివరి వనే్డలో టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమవ్వగా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లు చేసిన పరుగులతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు 19 ఏళ్ల ఆటగాడు శుభ్‌మాన్‌గిల్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నిరాశ పరచడంతో, టీ20కి తుది జట్టులో చోటు దక్కే అవకాశం తక్కువే. బౌలర్ల విషయానికొస్తే యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ బూమ్రా లేకపోవడంతో మహమ్మద్ సిరాజ్, ఖలీల్ అహమ్మద్‌తో పాటు సిద్దార్థ్ కౌల్, విజయ్‌శంకర్‌ల మధ్య పోటీ నెలకొనే అవకాశముంది. న్యూజిలాండ్‌తో చివరి రెండు వనే్డలు ఆడిన ఖలీల్ అహమ్మద్ పరుగులు ఎక్కువగా ఇవ్వకపోయనప్పటికీ ఒక్క వికెట్ తీసుకోకపోవడం గమనార్హం. భువనేశ్వర్ కుమార్, కేదార్ జాదవ్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, యుజువేంద్ర చాహాల్ బౌలింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే వనే్డ సిరీస్ కోల్పోయన కివీస్ ఎలాగైనా టీ20 సిరీస్‌ను గెలవాలనే పట్టుదలతో ఉంది. అయతే స్టార్ బ్యాట్స్‌మన్, ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ వెనె్నముక గాయంతో పూర్తిగా కోలుకోలేకపోవడంతో అతడి స్థానంలో ఆల్ రౌండర్ జేమ్స్ నీషమ్ జట్టులోకి వచ్చాడు. అలాగే డరియల్ మిచెల్, బ్లయర్ టిక్‌నర్‌లు మొదటిసారి జట్టుకు ఎంపిక కావడం తమకు కలిసొస్తుందంటున్నాడు కెప్టెన్ విలియమ్సన్. బౌలింగ్ విభాగంలో ట్రెంట్ బౌల్ట్ లేకపోవడం ఆతిథ్య జట్టుకు కొంత నష్టం కలిగించే అంశమే.
కివీస్‌దే పైచేయ..
పొట్టి ఫార్మాట్‌లో ఇప్పటివరకు న్యూజిలాండ్ జట్టే పైచేయ సాధించింది. ఇరు జట్ల మధ్య మూడు టీ20 సిరీస్‌లు జరగ్గా కివీస్ రెండు, భారత్ ఒక సిరీస్ గెలుచుకున్నాయ. 2008-09 మధ్య రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇరు జట్లు తలపడగా న్యూజిలాండ్ 2-0తో గెలిచింది. ఆ తర్వాత 2012-13 మధ్య మరోసారి రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనగా 1-0తో విజయం న్యూజిలాండ్‌నే వరించింది. చివరిసారిగా 2017-18లో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20ని టీమిండియా 2-1తో గెలుచుకుంది.
జట్టులో హార్దిక్, కృనాల్ సోదరులు..
న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య తొలిసారిగా కలిసి ఆడనున్నారు. వీరిద్దరూ ఇప్పటివరకు భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడడం ఇదే మొదటిసారి. గతంలో భారత జట్టులో మహిందర్ అమర్ నాథ్, సురీంధర్ అమర్‌నాథ్ సోదరులు, ఇర్ఫాన్, పఠాన్ సోద రులు ఆడిన విషయం తెలిసిందే.
న్యూజిలాండ్ జట్టు:కేన్ విలియ మ్సన్ (కెప్టెన్), డౌగ్ బ్రాస్‌వెల్, కొలిన్ డీగ్రాండ్‌హోం, లాకీ ఫెర్గూసన్, స్కాట్ కుగ్గే లైజిన్, డరియల్ మిచెల్, కొలిన్ మున్రో, జిమీ నీషమ్, మిచెల్ సాంత్నార్, టిమ్ సీఫర్ట్, ఇష్ సోదీ, టిమ్ సౌథీ, రాస్ టేలర్.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, రిషభ్ పంత్, దినేష్ కార్తీక్, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహాల్, భువనేశ్వర్ కుమార్, సిద్దార్థ్ కౌల్, ఖలీల్ అహమ్మద్, శుభ్‌మాన్ గిల్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్య, మహమ్మద్ సిరాజ్.

చిత్రాలు.. నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న భారత ఆటగాళ్లు