క్రీడాభూమి

నాకౌట్‌పై బెంగళూరు ఆశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 10: ఐపిఎల్‌లో హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఇప్పుడు ప్లే ఆఫ్‌లో స్థానం దక్కుతుందా లేదా అన్న అనుమానం వెంటాడుతున్నది. ఇప్పటి వరకూ తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు నాలుగు మ్యాచ్‌లను గెల్చుకుంది. ఐదు పరాజయాలను ఎదుర్కొంది. సోమవారం చివరి వరకూ హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ను ఒక పరుగు తేడాతో ఓడించిన బెంగళూరు ఊపిరి పీల్చుకుంది. బుధవారం ముంబయి ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లోనూ గెలిచి, నాటౌట్ ఆశలను సజీవంగా నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నది. ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ సోమవారం మ్యాచ్‌లో 20 పరుగులకే అవుటయ్యాడు. అయితే, లోకేష్ రాహుల్ (42), ఎబి డివిలియర్స్ (64) ఆదుకున్నారు. ముంబయిపైనా వీరు ఇదే తీరులో రాణించాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్ మెరుగ్గానే ఉన్నప్పటికీ, బౌలింగ్‌లో మాత్రం కోహ్లీ సేన సమస్యలను ఎదుర్కొంటున్నది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబయిలో హార్దిక్ పాండ్య, మిచెల్ మెక్‌క్లీనగన్, హర్భజన్ సింగ్, టిమ్ సౌథీ, జస్‌ప్రీత్ బుమ్రా వంటి మేటి బౌలర్లు ఉన్నారు. వారికి బెంగళూరు స్టార్ బ్యాట్స్‌మెన్ కోహ్లీ, డివిలియర్స్, లోకేష్ రాహుల్, సచిన్ బేబీ, షేన్ వాట్సన్ తదితరుల నుంచి సవాళ్లు తప్పవు. అయితే, ముంబయిలో కెప్టెన్ రోహిత్ శర్మ, పార్థీవ్ పటేల్, జొస్ బట్లర్, అంబటి రాయుడు, కొరి ఆండర్సన్, మార్టిన్ గుప్టిల్ వంటి బ్యాట్స్‌మెన్‌ను బెంగళూరు బౌలర్లు వరుణ్ ఆరోన్, స్టువర్ట్ బిన్నీ, యజువేంద్ర చాహల్, హర్షల్ పటేల్ తదితరులు ఎంత వరకు కట్టడి చేస్తారో చూడాలి. కాగితంపై ఇరు జట్లు సమాన బలంతో కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లకు అత్యంత కీలకం. దీనితో బుధవారం ఐపిఎల్‌లో మరో ఉత్కంఠ పోరును చూసే అవకాశం అభిమానులకు దక్కనుంది.