క్రీడాభూమి

చివరి మ్యాచ్ అయినా గెలిచేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్, ఫిబ్రవరి 9: నేడు హామిల్టన్‌లో న్యూజిలాండ్, భారత్ మహిళల జట్ల మధ్య చివరి టీ20 జరగనుంది. ఇప్పటికే సిరీస్‌ను 2-0 తేడాతో కివీస్ గెలుచుకోగా, చివరిదైన అనధికార మ్యాచ్‌లో విజయం సాధించి పరువు నిలుపుకోవాలని టీమిండియా భావిస్తోంది. అయతే భారత బ్యాటర్లలో స్మృతీ మంధాన, జెమీమా రోడ్రిగ్స్ మినహా మరెవరూ రాణించకపోవడంతోనే మొదటి మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో, రెండో మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక ఓపెనర్ ప్రియా పూనియా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు దాదాపు టాప్ ఆర్డర్ అంతా రెండు మ్యాచ్‌ల్లోనూ నిరాశ పరిచింది. మరోవైపు ఆతిథ్య జట్టు రెండు మ్యాచ్‌ల్లోనూ ఆల్‌రౌండ్ షోత్ అదరగొట్టి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను గెలుచుకుంది. చివరిదైన మ్యాచ్‌లోనూ గెలిచి పర్యాటక జట్టును క్లీన్‌స్వీప్ చేసి, వనే్డ సిరీస్ ఓటమికి బదులు తీర్చుకోవాలని చూస్తోంది.
మిథాలీ బెంచ్‌కే పరిమితమా?
వనే్డ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్‌ను జట్టు సెలక్టర్లు రెండు మ్యాచ్‌ల్లోనూ బెంచ్ కే పరిమితం చేశారు. జట్టులో ఓపెనింగ్ సమస్య ఉ న్నా ఆడించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయ. మిథాలీ స్థా నంలో వచ్చిన ఓపెనర్ ప్రియా పూనియా రెండు మ్యాచ్‌ల్లో వరుసగా (4), (5) పరుగులు చేసింది. దీంతో సెలక్టర్లు చివరిదైన టీ20 మ్యాచ్‌లో మిథా లీని బెంచ్‌కు పరిమితం చేయకుండా ఆడించాలని కోరుకుంటున్నారు.