క్రీడాభూమి

న్యూజిలాండ్ టూర్‌కు షకీబ్ అల్ హసన్ దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, ఫిబ్రవరి 9: న్యూజిలాండ్‌తో ఈ నెల 13 నుంచి జరిగే సిరీస్‌కు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ దూరమయ్యాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌లో బ్యాటింగ్ చేస్తుండగా చేతి వేలికి గాయం కావడంతో సిరీస్ మొత్తానికి దూరమైనట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పేర్కొంది. షకీబ్ కోలుకునేందుకు దాదాపు మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపినట్లు బోర్డు చీఫ్ దేబాశీష్ చౌదరి పేర్కొన్నారు. షకీబ్‌తో పాటు మరో బౌలర్ టస్కిన్ అహమ్మద్ సైతం గాయంతో టోర్నీకి దూరమైనట్లు తెలిపారు. వీరి స్థానాల్లో వనే్డలకు షఫీయల్ ఇస్లాం, టెస్టులకు ఈబాడట్ హోస్సేన్‌లతో భర్తీ చేస్తామన్నారు. హోస్సేన్ అంతర్జాతీయ స్థాయలో ఆడడం ఇదే మొదటిసారి. కాగా న్యూజిలాండ్ ప్రస్తుత ం భారత్‌తో టీ20 సిరీస్ ముగిసిన వెంటనే నేపియార్ వేదికగా 13నుంచి బంగ్లాతో వనే్డ సిరీస్ ఆడనుంది. ఈ రెండు జట్లు మొత్తం మూడు వనే్డలు, మూడు టెస్టుల్లో తలపడనున్నాయ. ఇప్పటివరకు బంగ్లా న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి.