క్రీడాభూమి

ఓటమితో ముగించారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్: ఆరు బంతులు.. 16 పరుగులు.. చివరి ఓవర్‌లో టీమిండియా చేయాల్సిన పరుగులు! మరోవైపు క్రీజులో దినేష్ కార్తీక్, కృనాల్ పాండ్య అప్పటికే మంచి ఫాంలో ఉన్న వీరు జట్టును గెలిపిస్తారనుకున్నారంతా. కానీ అనుహ్యాం గా భారత్ న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌ని నాలుగు పరుగుల తేడాతో ఓడింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్, కొలిన్ మున్రోలు మొదటి ఓవర్ నుంచే భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో అర్ధ సెంచరీకి చేరువైన సీఫెర్ట్ (43)ను కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ స్టాంపౌట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో కలిసి మరో ఓపెనర్ మున్రో ధాటిగా ఆడాడు. కృనాల్ పాండ్య వేసిన 10.1 ఓవర్‌లో సిక్స్ కొట్టిన మున్రో టీ20ల్లో తన తొమ్మిదో అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. కేవలం 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి ఊపుమీదున్న మన్రో (72)ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్‌కు పంపాడు. ఇక క్రీజులోకి వచ్చిన కొలిన్ డీగ్రాండ్ హోంతో జతకట్టిన విలియమ్సన్ (27) జట్టు స్కోరును వేగం గా పెంచే క్రమంలో ఖలీల్ అహమ్మద్ బౌలింగ్‌లో కుల్దీప్ యా దవ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత డీగ్రాండ్ హోం (30)ను భువనేశ్వర్ కుమార్ అవుట్ చేయడంతో డరియల్ మిచెల్ (19), రాస్ టేలర్ (14) చివరి ఓవర్ వరకు క్రీజులో ఉండి జట్టు స్కోరును 212కు చేర్చారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌కు రెండు, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహమ్మద్‌కు చెరో వికెట్ లభించింది. 213 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ మొదటి ఓవర్‌లోనే శిఖర్ ధావన్ (5) వికెట్ కోల్పోయంది. ఆ తర్వాత వచ్చిన విజయ్ శంకర్ 28 బంతుల్లోనే 43 పరుగులు చేసి సాంత్నార్ బౌలింగ్ లో పెవలియన్‌కు చేరాడు. మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్‌తో కలిసి నెమ్మదిగా స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పంత్ (28) 12 బంతుల్లోనే మూడు సిక్ సలు, ఒక్క ఫోర్ కొట్టి, టిక్‌నర్ బౌలింగ్‌లో విలియ మ్సన్‌కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరో 20 పరుగులకే రోహి త్ శర్మ (38) సైతం డరియల్ మిచెల్ బౌలింగ్‌లో పెవిలియన్ బాట పట్టాడు. దీంతో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్య (21), సినీయర్ బ్యాట్ సమన్ ధోనీ (2) నిరాశ పరిచారు. అప్పటికీ ఆరు కీలక వికెట్లు కోల్పోయన భారత్ 15.2 ఓవర్లలో 145 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత దినేష్ కార్తీక్ (33), కృనాల్ పాండ్య (26) చివరి వర కు పోరాడినా భారత్ నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయంది. దీంతో న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1తో గెలుచుకోగా, టీమిండియా న్యూజిలాండ్ పర్యటనను ఓటమితో ముగించినట్లయంది. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంత్నార్, డరియల్ మిచెల్ 2, స్కాట్ కుగ్లీజైన్, బ్లేయర్ టిక్‌నర్‌లకు చెరో వికెట్ దక్కింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కొలిన్ మున్రో, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ టిమ్ సీఫెర్ట్‌కి దక్కింది.
చివరి ఓవర్‌లో ఉత్కంఠ..
టిమ్ సౌథీ బౌలర్.. దినేష్ కార్తీక్ స్ట్రైకింగ్.. మొదటి బాల్ సౌథీ యార్కర్ వేయడంతో దినేష్ కార్తీక్ లాంగ్ ఆన్‌మీదుగా ఆడి రెండు పరుగులు సాధించాడు. ఇక కావాల్సింది ఐదు బంతుల్లో 14 పరుగులు.. సౌథీ వేసిన రెండో బంతిని కార్తీక్ స్వీప్ చేయబోయనా అందలేదు. అంపైర్ వైడ్‌గా ప్రకడిస్తాడేమో అని చూసినా నిరాశే ఎదురు కావడంతో ఆ బంతికి పరుగులేమీ రాలేదు. దీంతో విజయానికి భారత్ నాలుగు బంతుల్లో 14 పరుగులు చేయాల్సిన పరిస్థితి. మూడో బాల్ వేసిన సౌథీ పరుగులేమీ ఇవ్వలేదు. నాలుగో బంతిని మిడాఫ్‌లోకి కొట్టడంతో సింగిల్ వచ్చింది. ఇక రెండు బంతుల్లో 13 పరుగులు అవసరం. స్ట్రైకింగ్‌లో కృనాల్ పాండ్య సౌథీ వేసిన ఫుల్ టాస్ బాల్‌ను కొట్టగా రెండు పరుగులు రావాల్సింది దినేష్ కార్తీక్ చర్యతో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. దీంతో చివరి బంతికి భారత్ విజయానికి 12 పరుగులు కావాలి. ఈ క్రమంలో సౌథీ వైడ్ వేయడంతో టీమిండియా ఖాతాలో అదనంగా ఒక్క పరుగు చేరింది. ఆ తర్వాత చివరి బంతిని దినేష్ కార్తీక్ సిక్స్ కొట్టడంతో భారత్ 4 పరుగుల తేడాతో ఓడిపోయంది.
స్కోర్ బోర్డు..
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: టిమ్ సీఫార్ట్ (స్టాంప్) ధోనీ (బీ) కుల్దీప్ యాదవ్ 43, కొలిన్ మున్రో (సీ) హార్దిక్ పాండ్య (బీ) కుల్దీప్ యాదవ్ 72, కేన్ విలియమ్సన్ (సీ) కుల్దీప్ యాదవ్ (బీ) ఖలీల్ అహమ్మద్ 27, కొలిన్ డీగ్రాండ్ హోం (సీ) ధోనీ (బీ) భువనేశ్వర్ 30, డరియల్ మిచెల్ (నాటౌట్) 19, రాస్ టేలర్ (నాటౌట్) 14. ఎక్స్‌ట్రాలు: 7
మొత్తం: 212 (20 ఓవర్లలో 4 వికెట్లకు..)
వికెట్ల పతనం: 1-80, 2-135, 3-150, 4-193.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 4-0-37-1, ఖలీల్ అహమ్మద్ 4-0-47-1, హార్దిక్ పాండ్య 4-0-44-0, కృనాల్ పాండ్య 4-0-54-0, కుల్దీప్ యాదవ్ 4-0-26-2.
భారత్ ఇన్నింగ్స్: శిఖర్ ధావన్ (సీ) డరియల్ మిచెల్ (బీ) సాంత్నార్ 5, రోహిత్ శర్మ (సీ) సీఫెర్ట్ (బీ) డరియల్ మిచెల్ 38, విజయ్ శంకర్ (సీ) డీగ్రాండ్ హోం (బీ) సాంత్నార్ 43, రిషభ్ పంత్ (సీ) విలియమ్సన్ (బీ) టిక్‌నర్ 28, హార్దిక్ పాండ్య (సీ) కుగ్లీజైన్ 21, ఎంఎస్ ధోనీ (సీ) సౌథీ (బీ) డరియల్ మిచెల్ 2, దినేష్ కార్తీక్ (నాటౌట్) 33, కృనాల్ పాండ్య (నాటౌట్) 26. ఎక్స్‌ట్రాలు: 12 మొత్తం: 208 (20 ఓవర్లలో 6 వికెట్లకు..)
వికెట్ల పతనం: 1-6, 2-81, 3-121, 4-141, 5-145, 6-145.
బౌలింగ్: మిచెల్ సాంత్నార్ 3-0-32-2, టిమ్ సౌథీ 4-0-47-0, స్కాట్ కుగ్లీజైన్ 4-0-37-1, బ్లేయర్ టిక్‌నర్ 4-0-34-1, ఇష్ సోధీ 2-0-30-0, డరియల్ మిచెల్ 3-0-27-2.

చిత్రం.. ట్రోఫీతో న్యూజిలాండ్ జట్టు