క్రీడాభూమి

కుల్దీప్‌కి 2వ ర్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ, ఫిబ్రవరి 11: హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో యుజువేంద్ర చాహాల్ స్థానంలో తుదిజట్టులో చోటు దక్కించు కున్న చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసిన విషయం తెలిసిందే. దీంతో ఐసీసీ ప్రకటించిన తాజా టీ20 ర్యాకింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ 728 పాయం ట్లతో రెండో స్థానంలో నిలిచి తన కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకును అందుకు న్నాడు. కుల్దీప్ యాదవ్‌కు ముందు 793 పాయంట్ల అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఉన్నాడు. భారత బౌలర్లలో యుజువేంద్ర చాహల్ 609 పాయంట్లతో 17వ స్థానంలో కొనసాగుతుండగా, 608 పాయంట్లతో భువనేశ్వర్ కుమార్ 18, న్యూజి లాండ్ పర్యటనకు దూరమైన జస్ప్రీత్ బూమ్రా 26వ స్థానానికి పడిపోయాడు.
రోహిత్ 7, కోహ్లీ 19..
టీమిండియా హిట్టర్ రోహిత్ శర్మ టీ20 ర్యాకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో 698 పాయంట్లతో 7వ స్థానంలో కొనసాగుతుండగా, న్యూజిలాండ్‌తో పొట్టి ఫార్మట్‌కు దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ 599 పాయంట్లతో 19వ స్థానానికి పడిపోయాడు. ఈ విభాగంలో పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజామ్ 885 పాయంట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.
రెండో స్థానంలోనే..
జట్టు ర్యాకింగ్స్‌లో 135 పాయంట్లతో పాకిస్థాన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, 124 పాయంట్లతో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా (118), ఇంగ్లాండ్ (118), ఆస్ట్రేలియా (117), న్యూజిలాండ్ (116) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయ.