క్రీడాభూమి

పాక్‌తో మ్యాచ్‌లో ఓడిన విండీస్ మహిళల జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ, ఫిబ్రవరి 11: మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్ భాగంగా సోమవారం జరిగిన చివరి మ్యాచ్‌లో విండీస్ మహిళా జట్టుపై పాక్ విజయం సాధించి, 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. విండీస్ బ్యాటర్లలో స్టఫెనీ టైలర్ (52), డింద్రా డాటిన్ (28), షిమైన్ క్యాంబెల్ (26) మాత్రమే రాణించడంతో 47.3 ఓవర్లలోనే 159 పరుగులకు ఆలౌటైంది. పాకిస్థాన్ బౌలర్లలో డయానా బేగ్, నష్రా సంధూ చెరో మూడు వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాసించారు. ఆ తర్వాత 160 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ ఆరు వికెట్లు కోల్పోయ, మరో 16 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. పాక్ బ్యాటర్లలో సిధ్రా అమీన్ (52) అర్ధ సెంచరీతో రాణించగా, జవేరియా ఖాన్ (24), నిదా దార్ (26) ఆకట్టుకున్నారు.