క్రీడాభూమి

బోర్డు ప్రక్షాళనకు పది సూత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 10: బిసిసిఐని ప్రక్షాళన చేయడానికి మనోహర్ పది సూత్రాల విధానాన్ని చేపట్టాడు. క్రీడాకారులు, బోర్డు అధికారులకు సంబంధించి పరస్పర ప్రయోజనాల అంశాన్ని అధ్యయనం చేయడానికి ఒక ఉన్నతాధికారి నియామకం వీటిలో మొదటిది. మైదానంలో చోటుచేసుకునే అవినీతిపై విచారణ జరిపించే అధికారం బోర్డుకు లేదు కాబట్టి ప్రభుత్వ సంస్థలతో విచారణ జరిపించాలన్నది అతను తీసుకున్న మరో నిర్ణయం. దేశంలోని వివిధ రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు బిసిసిఐ నుంచి ఏటా 25 నుంచి 35 కోట్ల రూపాయలు వెళుతున్నాయేగానీ, వాటి వినియోగంపై ఇంత వరకూ ఎవరూ శ్రద్ధపెట్టలేదు. అయితే, ఈ అంశానికి మనోహర్ అత్యంత ప్రాధాన్యతనిచ్చాడు. స్వతంత్ర ఆడిటర్‌ను నియమించి, జమాఖర్చుల నిగ్గు తేలుస్తున్నాడు. బిసిసిఐ నిబంధనావళిని, ఆస్తులు, అప్పుల పట్టికను, 25 లక్షల రూపాయలకు మించిన వ్యయాలకు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచుతున్నాడు. బిసిసిఐ పాలక మండలి తీసుకుంటున్న నిర్ణయాలు, పాలన వ్యవహారాలన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించగలిగాడు. భారత క్రికెట్‌కు అత్యుత్తమ సేవలు అందిస్తున్న జాతీయ క్రికెట్ అకాడెమీని మరింతగా ఆధునీకరించే పనిని చేపట్టాడు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణ అందేలా చర్యలు తీసుకున్నాడు. మహిళా క్రికెటర్లను కూడా బోర్డు సెంట్రల్ కాంట్రాక్టు పరిధిలోకి తీసుకొచ్చాడు. సమ న్యాయానికి సరైన భాష్యం చెప్పాడు. సభ్య సంఘాల ప్రతినిధుల కోసం పాత రికార్డులను ముంబయిలోని బిసిసిఐ ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంచాడు. నిబంధనావళిని మార్చే వరకూ బిసిసిఐ ఎన్నికల సమయంలో ఓటింగ్‌కు దూరంగా ఉంటానని ప్రకటించి, తాను ఏ వర్గానికీ అనుకూలంగానీ, వ్యతిరేకంగానీ కానన్న సంకేతాలిచ్చాడు. అందరి అభిప్రాయాలను పరిశీలించి, క్షుణ్ణంగా చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలన్న కొత్త విధానానికి శ్రీకారం చుట్టాడు. ఈ విషయంలో అధ్యక్షుడిగా తనకు ఉన్న విచక్షణాధికారాన్ని వినియోగించుకోవద్దని తనపై తానే నియంత్రణను విధించుకున్నాడు. మనోహర్ తీసుకుంటున్న ఈ చర్యలతో బోర్డు ఒక్కసారిగా మారిపోకపోయినా, తక్కువ సమయంలోనే మార్పులు వస్తాయన్న నమ్మకం ప్రజలకు కలిగింది. రాత్రికిరాత్రే ప్రక్షాళన సాధ్యమవుతుందని చెప్పడానికి వీల్లేదు. అయితే, అతను బిసిసిఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నది.