క్రీడాభూమి

గప్తిల్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేపియర్, ఫిబ్రవరి 13: మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో భాగంగా బుధవారం నేపియర్ వేదికగా జరిగిన మొదటి వనే్డ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఓపెనర్ మార్టిన్ గప్తిల్ సూపర్ సెంచ రీతో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజ యం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎం చుకున్న బంగ్లాదేశ్ 48.5 ఓవర్లలో 232 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా బ్యాట్స్‌మెన్లలో మహమ్మద్ మిథున్ (62) అర్ధ సెంచరీ సాధించగా, మహమ్మద్ సైఫుద్దీన్ (41), సౌమ్య సర్కార్ (30) మాత్రమే రాణించారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, మిచెల్ సాంత్నార్ చెరో మూడు వికెట్లు తీసుకోగా, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్ తలో రెండో వికెట్లు తీసుకున్నారు.
వచ్చి రావడంతోనే..
గాయం కారణంగా భారత్‌తో టీ20 మ్యాచ్‌లకు దూరమైన న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (117) బంగ్లాదేశ్‌తో జరిగి న మొదటి వనే్డలో వచ్చి రావడంతోనే చెలరేగాడు. 4 సిక్సర్లు, 8 ఫోర్లతో 116 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇది గప్తిల్‌కు వనే్డల్లో 15వ సెంచరీ. గప్తిల్‌కు తోడు మరో ఓపెనర్ హెన్రీ (53) అర్ధ సెంచరీ సాధించడంతో కివీస్ 44.3 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయ విజయం సాధించింది. బంగ్లా బౌలర్లలో మెహిడీ హసన్, మహమ్మదుల్లాకు మాత్రమే చెరో వికెట్ దక్కింది. క్రిస్ట్ చర్చ్ వేదికగా శనివారం రెండో వనే్డ జరగనుంది.
స్కోర్ బోర్డు..
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ ఇక్బాల్ (సీ) లాథమ్ (బీ) బౌల్ట్ 5, లిటన్ దాస్ (బీ) మాట్ హెన్రీ 1, సౌమ్య సర్కార్ (సీ)(బీ) మాట్ హెన్రీ 30, ముషీఫికర్ రహీం (బీ) బౌల్ట్ 5, మహమ్మద్ మిథున్ (బీ) లాకీ ఫెర్గూసన్ 62, మహమ్మదుల్లా (సీ) రాస్ టేలర్ (బీ) లాకీ ఫెర్గూసన్ 13, సబ్బీర్ రహమన్ (స్టంప్ లాథమ్) (బీ) సాంత్నార్ 13, మెహిడీ హసన్ (సీ) నీషమ్ (బీ) సాంత్నార్ 26, మహమ్మద్ సైఫుద్దీన్ (సీ) గప్తిల్ (బీ) సాంత్నార్ 41, మషఫ్ మోర్తాజ (నాటౌట్) 9, ముస్తాఫిజుర్ రహమన్ (బీ) బౌల్ట్ 0. ఎక్స్‌ట్రాలు: 27
మొత్తం: 232 (48.5 ఓవర్లలో ఆలౌట్)
వికెట్ల పతనం: 1-5, 2-19, 3-42, 4-42, 5-71, 6-94, 7-131, 8-215, 9-229, 10- 232.
బౌలింగ్: మాట్ హెన్రీ 9-1-48-2, ట్రెంట్ బౌల్ట్ 9.5-0-40-3, కొలిన్ డీగ్రాండ్ హోం 5-0-19-0, లాకీ ఫెర్గూసన్ 10-1-44-2, మిచెల్ సాంత్నార్ 8-0-45-3, జేమ్స్ నీషమ్ 7-0-26-0.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: మార్టిన్ గప్తిల్ (నాటౌట్) 117, హెన్రీ నికోలస్ (బీ) మెహిడీ హసన్ 53, కేన్ విలియమ్సన్ ఎల్ బీడబ్ల్యూ (బీ) మహమ్మదుల్లా 11, రాస్ టేలర్ (నాటౌట్) 45.
ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 233 (44.3 ఓవర్లలో 2 వికెట్లకు)
వికెట్ల పతనం: 1-103, 2-137.
బౌలింగ్: మషఫ్ మోర్తాజ 8.3-0-33-0, మహమ్మద్ సైఫుద్దీన్ 7-0-43-0, ముస్తాఫిజుర్ రహమన్ 8-0-36-0, మెహిడీ హసన్ 8-1-42-1, సబ్బీర్ రహమన్ 7-0-41-0, మహమ్మదుల్లా 5-0-27-1, సౌమ్య సర్కార్ 1-0-8-0.