క్రీడాభూమి

దాయాదిపై మనదే పైచేయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లో భారత్-పాక్ మ్యాచ్‌కు ఉన్న ఆదరణ మరే మ్యాచ్‌కూ ఉండదేమో! ఈ రెండు దేశాలు ఆడుతున్నాయంటే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంటుంది. ఆటగాళ్ల దగ్గర్నుంచీ అభిమానుల దాకా ఒకటే నరాలు తెగే ఉత్కంఠత! ఈ ప్రభావం మ్యాచ్ ఫలితం తర్వాత చాలా రోజుల వరకూ ఎక్కడోచోట కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి ఘటనలు ఇప్పటివరకెన్నో.. అయతే.. ఈ ఏడాది మే నుంచి ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభం కానున్న ప్రపంచకప్‌లో జూన్ 16న ఈ రెండు జట్లు మరోసారి తలపడనున్నాయ. దీంతో ఇప్పటినుంచే ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ సహా ఇరు దేశాల అభిమానులు ఎదురు చూస్తున్నారు. పాక్ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మొయన్ ఖాన్ రెండు రోజుల క్రితం జీ టీవీ తో మాట్లాడుతూ ఈ ఏడాది ఇంగ్లాం డ్ వేదికగా జరిగే ప్రపంచకప్‌లో భారత్‌పై పాకిస్థాన్ తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయతే గత ఆరు ప్రపంచకప్‌లో భారత్-పాక్ ఆరు సార్లు తలపడగా, ప్రతిసారీ విజయం భారత్‌నే వరించింది. రెండేళ్ల క్రితం ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగిన మ్యాచ్ మినహా ఐసీసీ నిర్వహించిన అన్ని టోర్నీల్లో దాయాది దేశంపై టీమిండియానే పైచేయ సాధించింది.
1992 ప్రపంచకప్..
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్రపంచకప్‌లో మార్చి 4న సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్-పాక్ (16 మ్యాచ్)లు తలపడ్డాయ. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 49 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయ 216 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్లలో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సచిన్ టెండూల్కర్ (54) అర్ధ సెంచరీ సాధించగా, ఓపెనర్ అజేయ్ జడేజా (46), కపిల్ దేవ్ (35), మహమ్మద్ అజహరుద్దీన్ (32) రాణించారు. పాక్ బౌలర్లలో ముస్తాక్ అహమ్మద్ 3, ఆకీబ్ జావేద్ 2, వాసీం హైదర్ లకు ఒక వికెట్ లభించింది. 217 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 48.1 ఓవర్లలో 173 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 43 పరుగులతో తేడాతో విజయం సాధించింది. పాక్ బ్యాట్స్‌మెన్లలో అమీర్ సోహైల్ (62), జావేద్ మియాందాద్ (40) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో కపిల్‌దేవ్, మనోజ్ ప్రభాకర్, జవగాళ్ శ్రీనాథ్‌లు రెండేసి వికెట్లు తీసుకోగా, సచిన్ టెండూల్కర్, వెంకటపతి రాజు చెరో వికెట్ తీసుకున్నారు. స్లో ఓవర్ రేటు కారణంగా మ్యాచ్‌ను అంపైర్లు 49 ఓవర్లకు కుదించారు. సచిన్ టెండూల్కర్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ లభించింది. అయతే అనూహ్యాంగా పాకిస్థాన్ ప్రపంచకప్‌ను సాధించడం విశేషం.
1996..
ఆసియా దేశాలైన భారత్, పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్రపంచకప్‌లో మార్చి 9న బెంగళూరు వేదికగా చిన స్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్- పాక్ రెండో క్వాలిఫైలో తలపడ్డాయ. టాస్ గెలిచి ముందు బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయ 287 పరుగులు చేసింది. ఓపెనర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ (93) సెంచరీకి చేరువలో అవుట్ కాగా, మరో ఓపెనర్ సచిన్ టెండూల్కర్ (31), చివర్లో అజేయ్ జడేజా (43) రాణించారు. పాక్ బౌలర్లలో వకార్ యూనిస్, ముస్తాక్ అహమ్మద్ రెండేసి వికెట్లు తీసుకోగా, అకీబ్ జావేద్, అటౌర్ రహెమన్, అమీర్ సోహైల్‌కు తలో వికెట్ దక్కింది. 288 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పాక్ 49ఓవర్లలో 9వికెట్లు నష్టోయ 248 పరుగులు చేసింది. స్లో ఓవర్ రేటు కారణంగా పాక్ ఇన్నింగ్స్‌లో అంపైర్లు ఒక ఓవర్‌ను తగ్గించడంతో భారత్ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో వెంకటేశ్ ప్రసాద్, అనిల్‌కుంబ్లేలకు మూడేసి వికెట్లు దక్కగా, శ్రీనాథ్, వెంకటపతి రాజుకు చెరో వికెట్ లభించింది. 93 పరుగులు చేసిన నవజ్యోత్ సింగ్ సిద్దూకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ ప్రపంచకప్‌ను శ్రీలంక దక్కించుకుంది.
1999..
ఇంగ్లాండ్, స్కాట్‌లాండ్, వేల్స్, ఐర్లాండ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీలో నాలుగో సూపర్ సిక్స్‌లో దాయాది దేశాలు జూన్ 8న ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా తలపడ్డాయ. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయ 227 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్లలో రాహుల్ ద్రావిడ్ (61), మహమ్మద్ అజ హరుద్దీన్ (59) అర్ధ సెంచరీలకు తోడు సచిన్ టెండూల్కర్ (45) రాణించారు. పాక్ బౌలర్లలో వసీం అక్రం, అజార్ మహమూద్ రెండేసి వికెట్లు తీసుకోగా, షోయబ్ అక్తర్, అబ్దుల్ రజాక్ తలో వికెట్ తీసుకున్నారు. 228 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 45.3 ఓవర్లలో 180 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో వెంకటేశ్ ప్రసాద్ 5, జవగాళ్ శ్రీనాథ్ 3, అనిల్ కుంబ్లే 2 వికెట్లు తీసుకోవడంతో భారత్ 47 పరుగులతో విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వెంకటేశ్ ప్రసాద్‌కి దక్కింది.ఈ ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా దక్కించుకుంది.
2003..
దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యా సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీలో సెంచూరియన్ వేదికగా మార్చి 1న జరిగిన 36వ మ్యాచ్‌లో భారత్-పాక్ తలపడ్డాయ. ఈసారి టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 50 ఓవర్లలో 7వికెట్లు నష్టపోయ 273 పరుగులు చేసింది. ఓపెనర్ సయ్యద్ అన్వర్ (101) సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో జహీర్ ఖాన్, అశిష్ నేహ్రాలు రెండేసి వికెట్లు తీసుకోగా, శ్రీనాథ్, దినేష్ మోంగియా చెరో వికెట్ తీసుకున్నారు. ఆ తర్వాత 274 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ సచిన్ టెండూల్కర్ (98), యువరాజ్ సింగ్ (50) అర్ధ సెంచరీలకు తోడు రాహుల్ ద్రావిడ్ (44), మహమ్మద్ కైఫ్ (35) రాణించడంతో 45.4 ఓవర్లలోనే భారత్ 4 వికెట్లు కోల్పోయ విజయం సాధించింది. టైటిల్ పోరులో చివరి వరకు నిలిచిన భారత్ ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో ఓడిపోయంది.
2011..
భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీలో రెండో సెమీ ఫైనల్‌లో మార్చి 30న మొహలీ వేదిక జరిగిన మ్యాచ్‌లో దాయాది జట్లు త లపడ్డాయ. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయ 260 పరుగులు చేసింది. సచిన్ టెండూల్కర్ (85) అర్ధ సెంచరీకి తోడు వీరేంద్ర సెహ్వాగ్ (38), సురేశ్ రైనా (36) రాణించగా, పాక్ బౌలర్లలో వాహబ్ రియాజ్ 5 వికెట్లు, సయ్యద్ అజ్మల్ 2, మహమ్మద్ హఫీజ్ 1 వికెట్ తీసుకున్నారు. ఆ తర్వాత 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 49.5 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాట్స్‌మెన్లలో మిస్బా-ఉల్-హక్ (56) రాణించాడు. భారత బౌలర్లలో జహీర్ ఖాన్, అశిష్ నెహ్రా, మునాఫ్ పటేల్. హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ తలా రెండేసి వికెట్లు తీసుకోవడంతో భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. సచిన్ టెండూల్కర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించగా, ఈ ప్రపంచకప్‌ను భారత్ సొంత చేసుకుంది.
2015..
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీలో ఫిబ్రవరి 15న నాలుగో మ్యాచ్‌లో భారత్-పాక్‌లు తలపడ్డాయ. మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 50 ఓవర్లలో 7వికెట్లు కోల్పోయ 300 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్లలో విరాట్ కోహ్లీ (107), సురేశ్ రైనా (74), శిఖర్ ధావన్ (73) రాణించారు. పాక్ బౌలర్లలో సోహైల్ ఖాన్ 5 వికెట్లు, వాహబ్ రియాజ్ 1 వికెట్ తీశారు. ఆ తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన పాక్ జట్టు 47 ఓవర్లలో 224 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాట్స్‌మెన్లలో మిస్బా-ఉల్-హక్ (76) మాత్రమే రాణించాడు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 4, ఉమేశ్ యాదవ్, మోహిత్ శర్మ 2, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీసుకోవడంతో భారత్ 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లీకి లభించగా, భారత్ ఈ టోర్నీలో గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది.