క్రీడాభూమి

విహారీ వీర విహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, ఫిబ్రవరి 15: ఇరానీ కప్‌లో భాగంగా నాగపూర్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు రంజీ చాంపియన్ విదర్భ ముందు 279 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నాలుగో రోజు శుక్రవారం ఆటలో రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున ఆంధ్రా ఆటగాడు హనుమ విహారి (180) రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ చేశాడు. 4 సిక్స్‌లు, 19 ఫోర్లతో నాటౌట్‌గా నిలిచాడు. అంతకుముందు మొదటి ఇన్నింగ్స్‌లో త్రుటిలో సెంచరీ చేజార్చుకున్న మయాంక్ అగర్వాల్ (27), అన్మోల్ ప్రీత్ సింగ్ (6) నిరాశపర్చగా, మూడో వికెట్‌గా వచ్చిన విహారి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అంజిక్యా రహానెతో కలిసి విహారి 229 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలో రహానే (87) సర్వతే బౌలింగ్‌లో స్టాంప్ అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యార్‌తో కలిసి జట్టు స్కోరును 350 పరుగులు దాటించాడు. నాలుగో రోజు ఆట ముగుస్తుందనగా రెస్ట్ ఆఫ్ ఇండియా 3 వికెట్లు కోల్పోయ, 374 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. 280 పరగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన విదర్భ ఆట ముగిసే సమయానికి 1 వికెట్ కోల్పోయ 37 పరుగులు చేసింది. ఓపెనర్ ఫజల్ (0) పరుగులేమీ చేయకుండానే రాజ్‌పుత్ బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోగా, సంజయ్ రఘునాథ్ (17), అతర్వా తైదే (16) క్రీజులో ఉన్నారు. చివరిరోజు విదర్భ విజయం కోసం మరో 242 పరుగులు చేయాల్సి ఉంది.
హనుమ విహారి రికార్డు..
ఇరానీ కప్‌లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా హనుమ విహారి రికార్డు సృష్టించాడు. విహారి విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో రెండు సెంచరీలు నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన ఈ ఆంధ్రా ఆటగాడు శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ నమోదు చేశాడు. గతేడాది ఇదే విదర్భతో జరిగిన మ్యాచ్‌లో విహారి 183 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. దీంతో 2011 తర్వాత ఇరానీ కప్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా కూడా విహారినే కావడం విశేషం.
స్కోరు బోర్డు..
రెస్ట్ ఆఫ్ ఇండియా మొదటి ఇన్నింగ్స్ : 330 ఆలౌట్
విదర్భ మొదటి ఇన్నింగ్స్: 425 ఆలౌట్
రెస్ట్ ఆఫ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ : మయాంక్ అగర్వాల్ (సీ) మోహిత్ కాలె (బీ) వాఖరే 27, అన్మోల్ ప్రీత్ సింగ్ (సీ) వాఖరే (బీ) సర్వతే 6, హనుమ విహారి (నాటౌట్) 180, అంజిక్యా రహానే (స్టంప్, అక్షయ్ వాడ్కర్) (బీ) సర్వతే 87, శ్రేయాస్ అయ్యార్ (నాటౌట్) 61. ఎక్స్‌ట్రాలు: 13
మొత్తం: 374 డిక్లేర్డ్ (107 ఓవర్లలో 3 వికెట్లకు)
వికెట్ల పతనం: 1-25, 2-46, 3-275.
బౌలింగ్: ఆదిత్య సర్వతే 39-7-141-2, రాజ్‌నీష్ గుర్బానీ 8-1-36-0, అక్షయ్ వాఖరే 18-2-6-1, అక్షయ్ కర్నేవార్ 26-7-62-0, యాష్ ఠాకుర్ 6-1-33-0, సంజయ్ రఘునాథ్ 1-0-8-0, అతర్వా తైదే 9-1-24-0.
విదర్భ రెండో ఇన్నింగ్స్: ఫయాజ్ ఫజల్ (బీ) రాజ్‌పు త్ 0, సంజయ్ రఘునాథ్ (బ్యాటింగ్) 17, అతర్వా తైదే (బ్యాటింగ్) 16. ఎక్స్‌ట్రాలు: 4
మొత్తం: 37 (16 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి)
బౌలింగ్: అంకిత్ రాజ్‌పుత్ 4-0-10-1, తన్వీర్ ఉల్ హక్ 2-0-9-0, ధర్మేదసింగ్ జడేజా 6-1-13-0, రాహుల్ చాహర్ 4-3-1-0.