క్రీడాభూమి

రాహుల్ ఇన్.. కార్తీక్ అవుట్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, ఫిబ్రవరి 15: ఆస్ట్రేలియా ఈ నెల 24 నుంచి మార్చి 13 వరకు జరిగే టీ20, వనే్డ సిరీస్‌లకు భారత జట్టును శుక్రవారం సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ ఏడాది మే నుంచి మొదలు కానున్న ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని టీమ్ మేనేజ్‌మెంట్ జట్టును ఎంపిక చేసింది. టీ20 జట్టులో పంజాబ్‌కు చెందిన లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేకు చోటు కల్పించగా, పేసర్ సిద్ధార్థ్ కౌల్‌కు టీ20తో పాటు మొదటి రెండు వనే్డల్లో అవకాశం కల్పించారు. అయతే సినీయర్ ఆటగాడు దినేష్ కార్తీక్‌కు వనే్డల్లో చోటు లభించకపోగా, టీ20 జాబితాలో పేరు చేర్చారు. ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆటగాడు కేఎల్ రాహుల్‌కు మేనేజ్‌మెంట్ రెండు ఫార్మాట్లలో మరో అవకాశం కల్పించింది.
కోహ్లీ, బూమ్రా రాకతో జట్టుకు బలం..
ఇటీవల న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ జస్ప్రీత్ బూమ్రా విశ్రాంతి తీసుకన్న విషయం తెలిసిందే. అయతే స్వదేశంలో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌కు వీరిద్దరూ తిరిగి జట్టులో చేరడంతో భారత్ బలంగా కనిపిస్తోందని, అలాగే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి కల్పించడం లేదని జట్టు సెలక్షన్ కమిటీ చీఫ్ ఎంఎస్‌కే ప్రసాద్ స్పష్టం చేశాడు.
యువ ఆటగాళ్లకు చోటు
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో రాణించిన యువ వికెట్ కీపర్ రిషభ్‌పంత్, న్యూజిలాండ్ పర్యటనలో ఆక ట్టుకున్న ఆల్ రౌండర్ విజయ్ శంకర్‌కు సెలక్టర్లు చోటు కల్పిం చారు. టీ20లకు అంబటి రాయుడు, కేదార్ జాదవ్, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ స్థానాల్లో ఉమేశ్‌యాదవ్, కృనాల్ పాం డ్య, మయాంక్ మార్కండే, సిద్ధార్థ్ కౌల్‌లకు చోటు దక్కింది.
ప్రపంచకప్ దృష్ట్యా..
రానున్న ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకునే మేనేజ్‌మెంట్ జట్టును ఎంపిక చేసినట్లు స్పష్టమవుతుంది. అయతే ఇప్పటికే తుది జట్టును ఎంపిక చేశామని, ఒ క ఆటగాడి విషయంలోనే పునరాలోచించాలని ఇటీవల సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్‌కే ప్రసాద్ చెప్పిన విషయం తెలిసిందే. అయతే రిషభ్ పంత్, విజయ్‌శంకర్, కేఎల్ రాహుల్, అంబటి రాయుడు పేర్లను ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపిక చేయడంతో వీరిలోనే ఒకరిని ఎంపిక చేసే అవకాశముంది. మరోవైపు ప్రపంచకప్‌కు ముందు యువ వికెట్ కీపర్ రిషభ్‌పంత్‌కు అవకాశాలు కల్పించనున్నట్లు ఎంఎస్‌కే ప్రసాద్ స్పష్టం చేశాడు.
మొదటి రెండు వనే్డలకు భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోనీ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బూమ్రా, మహమ్మద్ షమీ, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, విజయ్ శంకర్, రిషభ్ పంత్, సిద్ధార్థ్ కౌల్, కేఎల్ రాహుల్
చివరి మూడు వనే్డలకు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోనీ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బూమ్రా, భువనేశ్వర్ కుమార్, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, విజయ్ శంకర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్.
టీ20 జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, దినేష్ కార్తీక్, మహేంద్రసింగ్ ధోనీ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కృనాల్‌పాండ్య, విజయ్ శంకర్, యుజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బూమ్రా, ఉమేశ్‌యాదవ్, సిద్ధార్థ్ కౌల్, మయాంక్ మార్కండే.