క్రీడాభూమి

వరుసగా రెండోసారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, ఫిబ్రవరి 16: ఇరానీ కప్‌లో భాగంగా నాగపూర్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుపై విదర్భ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో విజయం సాధించింది. ఐదో రోజు శనివారం ఓవర్ నైట్ స్కోరు 37 పరుగులతో రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన విదర్భకు ఓపెనర్ సంజయ్ రాఘునాథ్‌తో పాటు అథర్వా తైదే మంచి శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి 112 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కొద్దిసేపటికే రఘునాథ్ (42) రాహుల్ చాహర్ బౌలింగ్‌లో ఎల్‌బీగా అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన గణేశ్ సతీష్‌తో కలిసి తైదే (72) స్కోరు బోర్డు వేగం పెంచాడు. ఈ క్రమంలో రాహుల్ చాహర్ తైదేను ఎల్‌బీగా పెవిలియన్ పంపాడు. అప్పటికే ధాటిగా ఆడుతున్న గణేశ్ సతీష్ (87) కూడా అర్ధ సెంచరీ సాధించి హనుమ విహారి బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన మోహన్ కాలే (37) అవుట్ కావడంతో ధర్మేంద సిన్హ్ జడేజా పేవిలియన్‌కు పంపాడు. అప్పటికే సమయం ముగియడంతో మ్యాచ్ డ్రా అయంది. దీంతో ఇరు జట్ల కెప్టెన్లు సంధి చేసుకోవడంతో మొదటి ఇన్నింగ్స్‌లో 95 పరుగుల ఆధిక్యం సాధించిన విదర్భ జట్టును విజేతగా ప్రకటించారు. కాగా, 2018లోనూ తొలి ఇన్నింగ్స్ ఆధారంగానే విదర్భ టైటిల్ గెలవడం గమనార్హం.
స్కోరు బోర్డు..
రెస్ట్ ఆఫ్ ఇండియా మొదటి ఇన్నింగ్స్ : 330
విదర్భ మొదటి ఇన్నింగ్స్: 425 ఆలౌట్
రెస్ట్ ఆఫ్ ఇండియా రెండో ఇన్నింగ్స్: మొత్తం: 374/3 డిక్లేర్డ్
విదర్భ రెండో ఇన్నింగ్స్: ఫయాజ్ ఫజల్ (బీ) రాజ్‌పు త్ 0, సంజయ్ రఘునాథ్ ఎల్‌బీడబ్ల్యూ (బీ) రాహుల్ చాహర్ 42, అథర్వా తైదే ఎల్‌బీడబ్ల్యూ (బీ) రాహుల్ చాహర్ 72, గణేశ్ సతీష్ (సీ) వారియర్ (బీ) హనుమ విహారి 87, మోహిత్ కాలే (సీ) తన్వీర్ ఉల్ హక్ (బీ) డీఏ జడేజా 37, అక్షయ్ వాడేఖర్ (నాటౌట్) 10.
ఎక్స్‌ట్రాలు: 21
మొత్తం: 269 (103.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి)
బౌలింగ్: అంకిత్ రాజ్‌పుత్ 15-2-41-1, తన్వీర్ ఉల్ హక్ 8-3-19-0, ధర్మేదసిన్హ్ జడేజా 33-10-59-1, రాహుల్ చాహర్ 41-10-116-2, అన్మోల్‌ప్రీత్ సింగ్ 6-0-14-0, హనుమ విహారి 0.1-0-0-1.

చిత్రం..గణేశ్ సతీష్ (87)