క్రీడాభూమి

జాతీయ బాడ్మింటన్ చాంపియన్ సైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గువాహటి: జాతీయ బాడ్మింటన్ చాంపియన్‌గా సైనా నెహ్వాల్ మరోసారి నిలిచింది. శనివారం గువాహటిలో జరిగిన ఫైనల్‌లో పీవీ సింధుపై వరుస సెట్లలో 21-18, 21-15తో విజ యం సాధించింది. ఆట మొదటి నుంచి సైనా దూకుడుగా ఆడడంతో 30 నిమిషాల్లోనే పోరు ముగిసింది. గతేడాది కూడా జాతీయ టోర్నీ విజేతగా సైనా, సింధూపై రెండోసారి వరుసగా విజయం సాధించింది. దీంతో ఓవరాల్‌గా జాతీయ స్థాయలో నాలుగో టైటిల్ 2006, 2007, 2018, 2019 సాధించినట్లయంది.
సౌరభ్ హ్యాట్రిక్..
ఇక పరుషుల విభాగంలో సౌరభ్ వర్మ హ్యాట్రిక్ కొట్టాడు. వరుసగా మూడోసారి బాడ్మిం టన్ చాంపియన్‌షిప్ పురుషుల టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. శనివారం జరిగిన ఆసియా జూనియర్ చాంపియన్ ఫైనల్‌లో సౌరభ్ వర్మ 21-18, 21-13 తేడాతో లక్ష్య సేన్‌ను చిత్తుచేశాడు.

చిత్రాలు.. పీవీ సింధుతో సైనా నెహ్వాల్
*పురుషుల బాడ్మింటన్ చాంపియన్‌షిప్ టైటిల్ అందుకుంటున్న సౌరభ్ వర్మ