క్రీడాభూమి

రూ.5 కోట్లు విరాళం ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: జమ్మూ-కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన పాక్ ఉగ్రవాదుల భీకర దాడిలో బలైన సీఆర్‌పీఎఫ్ సైనికుల కుటుంబాలకు 5 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు యాక్టింగ్ ప్రెసిడెంట్ సీకే ఖన్నా కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఏఓ) చీఫ్ వినోద్ రాయ్‌కి విజ్ఞప్తి చేశాడు. ఈమేరకు సీఓఏ చీఫ్, ఆఫీస్ బేరర్లు, స్టేట్ యూనిట్లకు ఆయన రాసిన ఒక లేఖలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కుటుంబాలకు కొంతవరకైనా ఆసరగా ఉండేందుకు వీలుగా కనీసం ఐదు కోట్ల రూపాయలు విరాళంగా అందజేయాలని కోరాడు. ఆయా రాష్ట్రాల్లో క్రికెట్ సంఘాలు సైతం తమ శక్తిమేరకు సైనికుల కుటుంబాలకు సహాయపడేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశాడు. అదేవిధంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలు సైతం తమకు తోచిన రీతిలో వీర సైనికుల కుటుంబాలకు సహాయం అందించేందుకు ముందుకు రావాలని ఆయా యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఈనెల 24న జరిగే సిరీస్‌లో ఓపెనింగ్ గేమ్‌తోపాటు మార్చి 23 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో సైతం దివంగత సైనికుల మృతికి రెండు నిమిషాలపాటు వౌనం పాటించాలని సూచించాడు.