క్రీడాభూమి

వరల్డ్ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ వద్దేవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: జమ్మూ-కాశ్మీర్‌లోని పుల్వామాలో గురువారం పాక్ ముష్కరులు సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిపిన భీకర దాడిలో 44 మంది జవాన్లు అసువులు బాసిన నేపథ్యంలో అన్ని పార్టీల రాజకీయ నాయకులు, క్రీడాకారులు తమ నిరసనను వ్యక్తం చేశారు. పాకిస్తాన్ తీవ్రవాదులు జరిపిన ఈ దాడి నేపథ్యంలో ఈ ఏడాది మే 30 నుంచి జూలై 14వరకు ఇంగ్లాండ్‌లో జరిగే వరల్డ్ కప్ క్రికెట్‌లో భారత జట్టు పాకిస్తాన్‌తో జరిగే తలపడే పోరులో తలపడకుండా చూడాలని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ని కోరింది. వాస్తవానికి భారత్-పాక్ మధ్య జూన్ 16న ట్రఫోర్డ్‌లో వరల్డ్ కప్ మ్యాచ్ జరగాల్సి ఉంది. పుల్వామాలో భారత సైనికులపై పాక్ పాల్పడిన దుశ్ఛర్యకు నిరసనగా ఆ దేశంతో జరిగే వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్ ఆడకుండా చూడాలని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా సెక్రెటరీ సురేష్ బఫ్నా ఆదివారం బీసీసీఐని కోరాడు. భారత సైనికులపై భీకర దాడి జరిగినా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ విషయంలో తన వైఖరిని బహిర్గతం చేయకపోవడంతో తప్పంతా వారివైపు ఉందన్న విషయం విశవదమవుతుందని అన్నాడు. ‘సీఆర్‌పీఎఫ్ దళాలపై జరిగిన ఉగ్రవాద దాడులను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. క్రికెట్ కంట్రోల్ బోర్డు అన్నది ఒక క్రీడా రంగానికి చెందినదే కావచ్చు. కానీ మాకు క్రీడల కంటే దేశమే ముఖ్యం’ అని సీసీఐ సెక్రెటరీ సురేష్ బఫ్నా అన్నాడు. ‘పుల్వామాలో భారత సీఆర్‌పీఎఫ్ దళాలలపై జరిగిన దాడిపై అతను (ఇమ్రాన్ ఖాన్) స్పందించాలి. అతను పాకిస్తాన్‌ను ప్రధానమంత్రి. ఉగ్రదాడిలో తమ దేశం పాత్ర ఏమీ లేదని అనుకుంటే దానిపై తగిన సమాధానం చెప్పాలి. వాస్తవమేమిటో ప్రజలకు తెలియాలి. ఇమ్రాన్ ఖాన్ ఈ విషయంలో నోరు మెదకపోతే తమవైపే తప్పు ఉన్నట్టు అర్థం’ అని సీసీఐ సెక్రెటరీ అన్నాడు. ఇదిలావుండగా, 44 మంది సీఆర్‌పీఎఫ్ సైనికులను పాకిస్తాన్ ఉగ్రవాదులు బలి తీసుకున్న వెంటనే ముంబయిలోని బ్రబోర్న్ స్టేడియంలో గల సీసీఐ ప్రధాన కార్యాలయంలో పాక్ మాజీ కెప్టెన్, ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన చిత్రపటాలను తొలగించారు. భారత సైనిక దళాలలపై భీకర దాడి జరిగిన మరుసటిరోజే ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో ముక్తకంఠంతో ఖండించిందని ఆయన పేర్కొన్నాడు.
చిత్రం.. సీసీఐ కార్యదర్శి సురేష్ బఫ్నా