క్రీడాభూమి

రవిశాస్ర్తీది మంచి ఆలోచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 18: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని నాలుగో స్థానంలో ఆడించడం మం చి ఆలోచనే అని చీఫ్ సెలక్టర్ ఎం ఎస్‌కే ప్రసాద్ అభిప్రాయపడ్డారు. సోమవారం హాట్‌స్టార్‌తో ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘జ ట్టు అవసరాల కోసం రవిశాస్ర్తీ కోహ్లీని నాలుగో స్థానంలో ఆడిం చడం మంచి విషయమే. కానీ కొన్ని మ్యాచ్‌ల్లోనే ఇలాంటి ప్రయోగాలు చేస్తాం’ అని ఎంఎస్‌కే ప్రసాద్ స్పష్టం చేశారు. అయతే రవిశాస్ర్తీ నిర్ణయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కొట్టిపారేయ గా, లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సమర్థించాడు. కోహ్లీ ఇ ప్పటివరకు 39 సెంచరీలు సాధించ గా, అందులో 32 సెంచరీలు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చేసినవే. నాలుగో స్థానంలో 23 ఇన్నింగ్స్‌లు ఆడగా 58 సగటుతో 1744 పరుగు లు చేశాడు.
దినేష్ మ్యాచ్ ఫినిషర్
దినేష్ కార్తీక్ మ్యాచ్ ఫినిషర్ అనడంలో ఎలాంటి సందే హం లేదు. దానికి ఇటీవల మ్యాచ్‌ల్లో అతడి ప్రదర్శనే నిదర్శనం. ప్రపంచకప్ జట్టులో దినేష్‌ను ప్రపంచకప్‌కు ఎంపిక చేయలేదనే విషయం మేం చెప్పలేదు. కానీ వికెట్ కీపర్ బ్యాకప్ స్లాట్‌ను కూడా పరిగణలోకి తీసు కుంటున్నాం. రిషభ్ పంత్ తక్కువ కాలంలోనే పరిణితి చెందాడు. జట్టు అవసరాన్ని బట్టే రిషభ్‌కు అవకాశా లిస్తున్నామని ఎంఎస్‌కే ప్రసాద్ స్పష్టం చేశాడు.