క్రీడాభూమి

అసలేం జరగనుంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్‌పై సందిగ్ధత నెలకొంది. ఓవైపు భారత ప్రజలతో పాటు నాయకులు, మాజీ క్రికెటర్లు సైతం ప్రపంచకప్‌లో భాగంగా జూన్ 16న పాక్‌తో మ్యాచ్‌ను ఆడొద్దంటూ డిమాండ్ చేస్తున్నారు. అవును.. దెబ్బ తగిలినోడికే నొప్పి బాధ తెలుస్తోంది. దాదాపు 40 మంది జవాన్లు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోగా యావత్ భారత్ పాక్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టుతో మ్యాచ్ ఎలా ఆడతారంటూ ప్రశ్నిస్తోంది.
ఐసీసీ ఒప్పించనుందా?
ఈ నెల 27న దుబాయలో ఐసీసీ సమావేశాలు జరగనున్నాయ. సమావేశంలో దాయాదులతో మ్యాచ్‌పై చర్చించే అవకాశాలున్నాయ. అయతే ఐసీసీ భారత్‌ను మ్యాచ్ ఆడే విధంగా ఒప్పించనుందా? భారత్ ఐసీసీ మాట వినకుంటే తర్వాతి పరిణామాలేంటి? అనే ప్రశ్నలు భారత క్రికెట్ అభిమానుల్ని ఆలోచింపజేస్తోంది. దుబాయలో జరిగే ఈ సమావేశానికి బీసీసీఐ నుంచి సీఈవో రాహుల్ జోహ్రీ, సెక్రటరీ అమితాబ్ చౌదరి హాజరు కానున్నారు. మరోవైపు ఇరు దేశాల బోర్డుల మధ్య కొనసాగుతున్న వ్యవహారాన్ని తాము పరిశీ లిస్తున్నట్లు ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్‌సన్ పేర్కొనడం గమనార్హం.
2012-13 చివరి మ్యాచ్?
భారత్-పాక్ జట్లు ఇప్పటివరకు ఐసీసీ నిర్వహించే టోర్నీలు మినహా పాక్‌తో మ్యాచ్‌లు ఆడడం లేదు. ఈ రెండు జట్లు 2018లో దుబాయ వేదికగా జరిగిన ఆసియా కప్‌లో చివరి సారిగా తలపడ్డాయ. ద్వైపాక్షిక మ్యాచ్‌ల్లో మాత్రం 2012-13లో తలపడ్డాయ. అప్పటినుంచి అంటే దాదాపు పదేళ్లుగా ద్వైపాక్షిక మ్యాచ్‌లు ఆడలేదు.
నష్టం మనకేనా?
ఐసీసీ నిర వహించే టోర్నీలను ఆడబోమని చెప్పేందుకు బోర్డులకు అధికారం లేదు. అయతే ఏజట్టయతే మ్యాచ్ ఆడబోమని చెబుతుందో వారికి ప్రత్యర్థిగా ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఈ ఏడాది జూన్ 16న భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది. పాక్‌తో భారత్ ఆడకుంటే పాక్ జట్టునే నిబంధనల ప్రకారం విజేతగా ప్రకటించే అవకాశం ఉంటుంది. అయతే గ్రూప్ దశ మ్యాచ్‌లో ఆడకపోయనా, ఆ తర్వాత సెమీస్, ఫైనల్‌లో ఇరు జట్లు తలపడితే పరిస్థితి ఏంటనే ఆలోచన భారత అభిమానులకి నిద్రపట్టనివ్వడం లేదు.
స్పష్టం చేసిన బీసీసీఐ..
మరోవైపు బీసీసీఐ కూడా తన వైఖరి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తమ తొలి ప్రాధాన్యత దేశానికేనని, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగానే నడుచుకుంటామని ఇటీవల పలు సందర్భాల్లోనే స్పష్టం చేసింది. ఇదిలాఉంటే ఇప్పటికే టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెవాగ్, హర్భజన్‌సింగ్, గౌతం గంభీర్ భారత్ ఆడొద్దంటూ చెప్పిన విషయం తెలిసిందే.