క్రీడాభూమి

ఆసీస్‌తో సిరీస్‌లకు పాండ్య దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ఆస్ట్రేలియాతో త్వరలో జరగబోయే టీ-20, వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్‌లకు భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య అం దుబాటులో ఉండడు. దీనితో అతని స్థానంలో మరో ఆల్‌రౌండర్ రవీం ద్ర జడేజాను జట్టులోకి తీసుకున్నారు. వెన్నునొప్పితో పాండ్య బాధప డుతున్నాడని, అతను మ్యాచ్‌లు ఆడే పరిస్థితిలో లేడని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) గురువారం విడుదల చేసిన ఒక ప్రకటన లో తెలిపింది. ఒక టీవీ షోలో మహిళల గురించి అసభ్యకరంగా మా ట్లాడిన కారణంగా సస్పెన్షన్ వేటును ఎదుర్కొన్న పాండ్య, తిరిగి భారత జట్టులో చోటు సంపాదించాడు. అయతే, వెన్నునొప్పితో బాధపడుతున్న అతనికి వైద్య పరీక్షలు జరిపించారు. బీసీసీఐ వైద్యుల బృందం అన్ని రిపోర్టులను పరిశీలించిన తర్వాత పాండ్యకు విశ్రాంతి అత్యవసరమని స్పష్టం చేయడంతో, ఆసీస్‌తో సిరీస్‌లనుంచి అతనిని తప్పించారు.