క్రీడాభూమి

పరుగుల వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింగ్‌స్టన్ ఓవల్ (బార్బడాస్): భారీ పరుగులు నమోదు కావడం వనే్డ ఇంటర్నేషనల్స్‌లో చాలా సహజంగా మారిపోయింది. వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి వనే్డలో పరుగుల వరద పారడం, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో చోటు చేసుకుంటున్న పవర్ ప్లేకు అద్దం పడుతుంది. ముగ్గురు బ్యాట్స్‌మెన్ సెంచరీలు నమోదు చేసిన ఈ వనే్డలో, విండీస్‌పై ఇంగ్లాండ్ రికార్డు విజయాన్ని నమోదు చేసింది. క్రిస్ గేల్ తుపాను శతకంతో ప్రేక్షకులను అలరించగా, ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్, ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ జో రూట్ సెంచరీలతో కదంతొక్కి తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ సెంచరీతో చెలరేగినప్పటికీ, ఇంగ్లాండ్ అందుకు దీటైన సమాధానానే్న ఇచ్చింది. తొలుత బ్యాంకింగ్‌కు దిగిన విండీస్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 360 పరుగులు చేసింది. ఓపెనర్ క్రిస్ గేల్ 129 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, 12 భారీ సిక్సర్లతో ప్రేక్షకులను అలరిస్తూ 135 పరుగులు సాధించాడు. మంచి ఫామ్‌లో ఉన్న అతనిని బెన్ స్టోక్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. జాన్ క్యాంప్‌బెల్ 30 పరుగులకే మొదటి వికెట్‌గా వెనుదిరగ్గా, వికెట్‌కీపర్/బ్యాట్స్‌మన్ షాయ్ హోప్ 65 బంతుల్లో 64 పరుగులు చేసి, స్టోక్స్ బౌలింగ్‌లోనే అదిల్ రషీద్‌కు చిక్కాడు. షిమ్రన్ హేట్‌మేయర్ 15 బంతుల్లో 20 పరుగులు చేసి, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో జాసన్ రాయ్ చక్కటి క్యాచ్ అందుకోవడంతో వెనుదిరిగాడు. నికొలస్ పూరన్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. అప్పటి వరకూ ధాటిగా ఆడుతూ, విండీస్ స్కోరు బోర్డును పరుగులు తీయించిన గేల్ ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్ జాసన్ హోల్డర్ 16, కార్లొస్ బ్రాత్‌వెయిట్ 3 పరుగులు చేసి ఔట్‌కాగా, చివరిలో ఆష్లే నర్స్ 25, దేవేంద్ర బిషూ 9 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్, అదిల్ రషీద్ చెరి మూడు వికెట్లు పడగొడితే, క్రిస్ వోక్స్‌కు రెండు వికెట్లు లభించాయి.
విండీస్ నిర్దేశించిన 361 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 91 పరుగుల వద్ద మొదటి వికెట్‌ను జానీ బెయిర్‌స్టో (34) రూపంలో కోల్పోయింది. అయితే, ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన జో రూట్ చక్కటి సహకారాన్ని అందించడంతో ఓపెనర్ జాసన్ రాయ్ బ్యాట్‌కు పదును పెట్టాడు. 205 పరుగుల స్కోరువద్ద ఔటైన జాసన్ రాయ్ 85 బంతులు ఎదుర్కొని 123 పరుగులు సాధించాడు. ఈ స్కోరులో 15 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 51 బంతుల్లో 65 పరుగులు చేయగా, జూ రూట్ 97 బంతులు ఎదుర్కొని, తొమ్మిది ఫోర్ల సాయంతో 102 పరుగులు సాధించాడు. చివరిలో బెన్ స్టోక్స్ 20, జొస్ బట్లర్ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, ఇంగ్లాండ్‌ను విజయాన్ని పూర్తి చేశారు. 48.4 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లకు 364 పరుగులు చేసిన ఇంగ్లాండ్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది, ఈ సిరీస్‌లో శుభారంభం చేసింది.
సంక్షిప్త స్కోర్లు
వెస్టిండీస్: 50 ఓవర్లలో 8 వికెట్లకు 360 (క్రిస్ గేల్ 135, షాయ్ హోప్ 64, డారెన్ బ్రేవో 40, బెన్ స్టోక్స్ 3/37, అదిల్ రషీద్ 3/74, క్రిస్ వోక్స్ 2/59).
ఇంగ్లాండ్: 48.4 ఓవర్లలో 4 వికెట్లకు 364 (జాసన్ రాయ్ 123, జో రూట్ 102, ఇయాన్ మోర్గాన్ 65, జాసన్ హోల్డర్ 2/63).
చిత్రం.. ఇంగ్లాండ్ సెంచరీ హీరోలు జాసన్ రాయ్, జో రూట్