క్రీడాభూమి

అలా చేస్తే పాక్‌కు సాయం చేసినట్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ప్రపంచకప్‌లో భాగంగా పాక్‌తో మ్యాచ్‌ను ఆడకుండా వారికి రెండు పాయంట్లు అప్పగిస్తే పాక్‌కు సాయం చేసినట్లేనని టీమిండియా మాజీ ఆట గాడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. ‘ప్రపంచకప్ వంటి మెగా టోర్నోల్లో ఇప్పటివరకు పాక్‌పై భారత్‌దే పైచేయగా ఉంది. ఇది మరోసారి వారిని ఓడించే సమయం. పాక్‌కు రెండు పాయంట్లు ఇవ్వడాన్ని నేను అసహ్యహించుకుంటున్నా’ అని అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయతే తన మొదటి ప్రాధాన్యత దేశానికేనని, దేశం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశాడు.
పుల్వామా ఉగ్ర దాడిలో 40 మందికి పైగా భారత జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో దాయాది దేశంతో క్రికెట్‌తో పాటు మిగతా క్రీడల్లో ఆడ కూడదంటూ మాజీ క్రికెటర్లు పిలుపునిస్తున్న విషయం తెలిసిందే.