క్రీడాభూమి

ఇంకా నిర్ణయం తీసుకోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ఈ ఏడాది ప్రపంచకప్‌లో జూన్ 16న జరిగే భారత్-పాక్ మ్యాచ్‌పై సందిగ్ధం నెలకొనడం, గ్రూపు దశ నుంచి మరే దశలో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడ కూడదనే డిమాండ్లు తెరమీదికొసున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో శుక్రవారం సీఓఏ (కమిటీ ఆఫ్ అడ్మిని స్ట్రేటర్స్) బీసీసీఐతో సమావేశమైంది. సమావేశం అనంత రం సీఓఏ చైర్మన్ వినోద్‌రాయ్ మాట్లాడుతూ భారత్-పాక్ మ్యాచ్‌పై తామింకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. బీసీసీఐతో జరిపిన చర్చల్లో ముఖ్యంగా ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్లకు మరింత భద్రతను పెంచాలని, ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్న దేశాలతో సంబంధాలను తెంపుకోవాలని ఐసీసీని కోరుతున్నామని చెప్పారు. మరోవైపు ఇదే విషయమై ఐసీసీకి లేఖ రాసేందుకు బీసీసీఐ నిర్ణయంచిందన్నారు. జూన్ 16కు చాలా సమయం ఉందని, అప్పటిలోగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని వివరించారు. మరోవైపు హోం మంత్రి రాజ్‌నాథ్ వ్యాఖ్యలపై తాను స్పందిచబోనని చెప్పారు.