క్రీడాభూమి

భారత్ లేఖ అందింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ, ఫిబ్రవరి 23: ఉగ్రవా దాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల తో సంబంధాలను తెంచుకోవాలని కోరు తూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు రాసిన లేఖపై అంతర్జాతీయ క్రికెట్ మండలి స్పందించింది. శుక్రవారం సమావేశమైన సీఓఏ పాక్‌తో మ్యాచ్ ప్రస్తావన లేకుండా ఉగ్రవాదాన్ని ప్రో త్సహిస్తున్న దేశాలతో క్రికెట్ సం బం ధాలను నిలిపివేయాలని లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచకప్‌లో తమ ఆటగాళ్లకు పటి ష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఐసీసీ కోరింది. దీనిపై స్పందించిన ఐసీసీ ఆటగాళ్ల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేసింది. ఈ విషయంలో బీసీసీఐ ఎలాంటి ఆం దోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ‘బీసీసీఐ రాసిన లేఖ మా కు చేరింది. ప్రపంచకప్‌లో ఆటగాళ్ల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత. దీనికి ఎప్పుడూ పెద్దపీట వేస్తాం. మా ర్చి 2న జరగనున్న ఐసీసీ సభ్యుల సమావేశంలో బీసీసీఐ రాసిన లేఖపై పూర్తిస్థాయలో చర్చిస్తాం. కచ్చితంగా బీసీసీఐ భద్రతాపరమైన హామీ ఇ స్తాం. ప్రపంచకప్‌లో మా ఏర్పాట్లతో బీసీసీఐని సంతృప్తి పరుస్తాం’ అని ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ తెలిపారు.