క్రీడాభూమి

అపూర్వికి స్వర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: అంతర్జాతీ య షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచకప్‌లో భాగం గా శనివారం ప్రారంభమైన షూటింగ్ వరల్డ్‌కప్‌లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణం చేరింది. 10 మీటర్ల ఎయర్ రైఫి ల్ విభాగంలో భారత స్టార్ షూటర్ అపూర్వి చండీలా ఈ ఘనతను అం దుకుంది. ఫైనల్‌లో మొత్తం 252.9 పాయంట్లతో అపూర్వి కొత్త రికార్డు నెలకొల్పగా, చైనాకు చెందిన జాహో రౌఝు 251.8 పాయంట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఫలితంగా వరల్డ్ కప్ షూటింగ్ 10 మీటర్ల ఎయర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం గెలుచుకన్న రెండో భారత షూటర్‌గా అపూర్వి నిలి చింది. అంతకుముందు అంజలీ భగ వత్ ఈ ఘనత సాధించింది. అపూర్వికిది వరల్డ్ కప్‌లో మూడో పతకం. గత ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్‌కప్ లో అపూర్వి రజతం సాధించిన విష యం తెలిసిందే.