క్రీడాభూమి

ఇంగ్లాండ్ మహిళల క్లీన్‌స్వీప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, మార్చి 9: ఊహించినట్లుగానే ఇంగ్లాండ్ మహిళల చేతిలో భారత మహిళా జట్టు వైట్‌వాష్ అయంది. గౌహతి వేదికగా శనివారం జరిగిన చివరి టీ20లో భారత్ 1 పరగు తేడాతో ఓడిపోవడం సిరీ స్‌ను ఇంగ్లాండ్ 3-0తో కైవసం చేసుకుంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ మహిళా జట్టులో టామీ బీవౌంట్ (29), వికెట్ కీపర్ అమీ ఎలెన్ జోన్స్ (26) డానియెల్లీ వ్యాట్ (24) రాణిం చడంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయ 119 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అనూజ పాటిల్, హర్లీన్ డియోల్‌కు 2, ఏక్తా బిస్త్, పూనమ్ యాదవ్‌కు చెరో వికెట్ దక్కింది. లక్ష్య ఛేదనకు దిగిన భారత్ జట్టులో కెప్టెన్ స్మృతీ మంధాన (58), సినీయర్ క్రీడాకారిణి మిథాలీ రాజ్ (30, నాటౌట్) మినహా మరెవరూ రాణించకపోడంతో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయ 118 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో కేట్ క్రాస్ 2, అన్య శ్రుబ్సోల్, లిన్సీ స్మిత్, లౌరా మార్ష్‌లకు తలో వికెట్ దక్కిం ది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ డానియెల్లీ వ్యాట్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కేట్ క్రాస్‌కు లభించింది.
6 బంతులు 3 పరుగులు..
భారత్ మహిళా జట్టు విజయా నికి చివరి ఓవర్ 3 పరుగులు అవ సరం. క్రీజులో సినీయర్ బ్యాటర్ మిథాలీ రాజ్, భారతి ఫుల్మాలి ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్ కేట్ క్రాస్ తొలి మూడు బంతులకు పరుగులేమీ ఇవ్వక పోగా, నాలుగో బంతికి ఫుల్మాలి పెవిలియన్‌కు చేరింది. దాంతో చివరి రెండు బంతుల్లో భారత్‌కు మూడు పరుగు లు కావాల్సి వచ్చింది. ఐదో బంతికి అనుజా పాటిల్ కూ డా అవుటవ్వగా, చివరి బంతికి శిఖా పాండే ఒక్క పరుగు మాత్రమే చేయడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.
చిత్రాలు.. స్మృతీ మంధాన (58)

*సిరీస్‌తో ఇంగ్లాండ్ మహిళా జట్టు