క్రీడాభూమి

మార్పు పక్కా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహలీ: మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే వనే్డ సిరీస్‌ను కైవసం చేసుకుందామనుకున్నా టీమిండియాకు నిరా శే ఎదురైంది. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వనే్డలో 32 పరుగుల తేడాతో ఓడింది. ఆస్ట్రేలి యాతో సిరీస్ ప్రారంభం నుంచి కోహ్లీ మినహా భారత బ్యాటిం గ్ పేలవ ప్రదర్శన కనబరుస్తూనే ఉంది. దీంతో ఆదివా రం జరిగే నాలుగో వనే్డలకు మార్పు ఖాయం గా కనిపిస్తోంది. ప్రస్తుతం సిరీస్‌లో భారత్ 2-1తో ముందజలో ఉంది. అయతే టీమిం డియా రెగ్యూలర్ ఓపెనర్లూ శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ప్రదర్శన ప్రపంచకప్‌కు ముందు టీమ్ మేనేజ్‌మెంట్‌ను కలవర పెడుతోంది. రోహిత్ మూడు వనే్డల్లో కలిపి మొత్తం 51 పరగులు చేయగా, ధావన్ 22 పరుగులు మాత్రమే చేయగలిగాడు, ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అంబటి రాయుడు సైతం 33 పరుగులు చేసి తీవ్రంగా నిరాశ పరిచాడు. దీంతో కోహ్లీ చివరి రెండు వనే్డలకు మార్పు కోరుతున్నట్లు తెలుస్తోంది.
కోహ్లీ తర్వాత జాదవ్..
ఇప్పటివరకు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రమే మూడు ఇన్నింగ్స్ ల్లో కలిపి 283 పరుగులు చేసి టాప్‌లో నిలిచాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయ. కోహ్లీ తర్వాత కేదార్ జాదవ్ మాత్రమే చెప్పుకోదగిన రీతిలో ఆడాడు. జాదవ్ మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 118 పరగులు చేయగా, ఇందులో ఒక అర్ధ సెంచరీని సాధించాడు.
రాహుల్‌కి ఛాన్స్ ఇస్తారా?
ఇటీవల మహిళలపై అభ్యంతర వ్యాఖ్యలు చేసి, తిరిగి జట్టులో చోటు సంపాదించుకున్న కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. అయతే ప్రస్తుతం భారత్ ఓపెనింగ్ సమస్య తీరాలంటే రోహిత్, శిఖర్, అంబటి రాయుడు లో ఎవరినో ఒకరిని బెంచ్‌కు పరిమితం చేసి కేఎల్ రాహుల్‌ను ఆడిస్తే బాగుంటుందని క్రికెట్ విశే్లషకులు భావిస్తున్నారు.
అందరి కళ్ల్లూ పంత్‌పైనే..
భారత యువ క్రికెటర్ రిషభ్‌పంత్‌ను ప్రపంచకప్‌లో ఆడించా లని జట్టు మేనేజ్‌మెంట్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు పంత్‌కు లండన్ వెళ్లేందుకు టికెట్ వచ్చేసిందట. అయతే చివరి రెండు వనే్డలకు ధోనీ అందుబాటులో లేకపోవడంతో పంత్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. టీ20ల్లో విఫలమైన పంత్ చివరి రెండు వనే్డల్లో రాణిస్తే, ప్రపంచకప్‌కు ధోనీకి ప్రత్యా మ్నాయంగా, జట్టుకు బ్యాట్స్‌మెన్ రూపంలో లబ్ధి చేకూరినట్లే.
చిత్రం.. రిషభ్‌పంత్