క్రీడాభూమి

మ్యాచ్‌ను మలుపు తిప్పిన టర్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, మార్చి 10: ఆస్ట్రేలియాతో ఐదు వనే్డ మ్యాచ్‌లలో భాగంగా ఆదివారం ఇక్కడి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో జరిగిన నాలుగో వనే్డలో ఆసిస్‌దే పైచేయి అయింది. సిరీస్‌లో ఇప్పటికే భారత్ వరుసగా జరిగిన తొలి రెండు వనే్డల్లో విజయం సాధించగా, మూడో వనే్డలో పర్యాటక జట్టు గెలిచింది. నాలుగో వనే్డ ఇరు జట్లకు అత్యంత కీలకం కాగా, సిరీస్ చేజిక్కించుకోవడానికి ఆతిధ్య భారత్, గెలుపు ద్వారా సిరీస్‌పై పట్టు సాధించడానికి ఆస్ట్రేలియా హోరాహోరీగా తలపడ్డాయి. అయితే, చివరకు విజయం ఆసిస్‌నే వరించింది. ప్రత్యర్థి ముందు భారీ ఆధిక్యాన్ని ఉంచినా ఆస్ట్రేలియా జట్టులోని ముగ్గురు బ్యాట్స్‌మెన్లు భారీ పరుగులు చేయడంతో విజయం వరించింది. భారత్ నిర్దేశించిన 359 పరుగుల భారీ లక్ష్యాన్ని 475.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఆద్యంతం చెలరేగి ఆడారు. వారిద్దరూ బరిలో ఉన్నంతసేపూ సిక్సర్లు, బౌండరీల వర్షం కురిపించారు. రోహిత్ 95 పరుగులతో, శిఖర్ ధావన్ 143 పరుగులు చేశారు. ఈ ద్వయం 193 పరుగులతో ఆద్యంతం ఆకట్టుకున్నారు. శిఖర్ ధావన్ వనే్డల్లో తన 16వ శతకాన్ని నమోదు చేశాడు. జట్టు స్కోరు 62 పరుగుల వద్ద ఆసిస్‌పై వనే్డల్లో 1000 పరుగులు చేసిన తొలి భారత ఓపెనర్లుగా, అత్యధిక సెంచరీల భాగస్వామ్యం (5) చేసిన క్రికెటర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ నిలిచారు. అయితే, రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై 23వ శతకాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. 92 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 2 సిక్సర్లు, 7 బౌండరీల సహాయంతో 95 పరుగులు చేసి జే రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో హ్యాండ్స్‌కాంబ్‌కు క్యాచ్ ఇచ్చాడు. 115 బంతులు ఎదుర్కొని 3 సిక్సర్లు, 18 బౌండరీలతో 143 పరుగులు చేసిన ధావన్‌ను పాట్ కమిన్స్ బౌల్డ్ చేయడం ద్వారా అతని దూకుడుకు ముకుతాడు వేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 6 బంతులు ఎదుర్కొని 1 బౌండరీతో 7 పరుగులు చేసి జే రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో అలెక్స్ కారేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. 31 బంతులు ఎదుర్కొన్న లోకేష్ రాహుల్ 1 బౌండరీతో 26 పరుగులు చేసి ఆడమ్ జంపా బౌలింగ్‌లో అలెక్స్ కారేకి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. వికెట్ కీపర్ రిషభ్ పంత్ 24 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్, 4 బౌండరీలతో 36 పరుగులు చేసి పాట్ కమిన్స్ బౌలింగ్‌లో అరోన్ ఫించ్‌కు క్యాచ్ ఇచ్చాడు. 12 బంతులు ఎదుర్కొన్న కేదార్ జాదవ్ 10 పరుగులు చేసి పాట్ కమిన్స్ బౌలింగ్‌లో జే రిచర్డ్‌సన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. భువనేశ్వర్ కుమార్ 2 బంతులు ఎదుర్కొని 1 పరుగు చేసి జే రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో అలెక్ కారేకి క్యాచ్ ఇచ్చాడు. 15 బంతులు ఎదుర్కొన్న విజయ్ శంకర్ 2 సిక్సర్లు, 1 బౌండరీతో 26 పరుగులు చేసి పాట్ కమిన్స్ బౌలింగ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి తిరుగుముఖం పట్టాడు. యుజ్వేంద్ర చాహల్ 1 బంతిని ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే పాట్ కమిన్స్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. కుల్దీప్‌యాదవ్ 1 బంతిని ఎదుర్కొని 1, జస్ప్రీత్ బుమ్రా 1 బంతిని ఎదుర్కొని 1 సిక్సర్‌తో 6 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఆసిస్ బౌలర్లలో పాట్ కమిన్స్ 10 ఓవర్లలో 70 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. జే రిచర్డ్‌సన్ 9 ఓవర్లలో 85 పరుగులిచ్చి 3 వికెట్లు, ఆడమ్ జంపా 10 ఓవర్లలో 57 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నారు. అనంతరం 359 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 47.5 ఓవర్లలోనే విజయాన్ని నమోదు చేసింది. 47.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 359 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన కెప్టెన్ అరోన్ ఫించ్ 2 బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే భువనేశ్వర్ కుమార్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. 10 బంతులు ఎదుర్కొన్న షాన్ మార్ష్ 1 బౌండరీతో 6 పరుగులు చేసి జస్ప్రీత్ బుమ్రా చేతిలో బౌల్డ్ అయ్యాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి క్రీజులో ఉన్నంతసేపూ బౌండరీలతో ఆకట్టుకున్న ఉస్మాన్ ఖాజా సెంచరీ తృటిలో చేజారింది. 99 బంతులు ఎదుర్కొన్న ఉస్మాన్ ఖాజా 7 బౌండరీలు ఎదుర్కొని 91 పరుగులు చేసి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చాడు.
13 బంతులు ఎదుర్కొన్న గ్లెన్ మాక్స్‌వెల్ 1 సిక్సర్, 2 బౌండరీలతో 23 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. బరిలోకి దిగినప్పటినుంచి క్రీజులో పాతుకుపోయిన పీటర్ హ్యాండ్స్‌కోంబ్ సిక్సర్లు, బౌండరీలతో చెలరేగాడు. ఎట్టకేలకు యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో పీటర్ ఔటయ్యాడు. 105 బంతులు ఎదుర్కొన్న హ్యాండ్స్‌కాంబ్ 3 సిక్సర్లు, 8 బౌండరీలతో 117 పరుగులు చేశాడు. యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో లోకేష్ రాహుల్ క్యాచ్ పట్టగా వెనుతిరిగాడు. వికెట్ కీపర్ అలెక్స్ కారే 15 బంతులు ఎదుర్కొని 2 బౌండరీలతో 21 పరుగులు చేసి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆస్టన్ టర్నర్ 43 బంతులు ఎదుర్కొని 6 సిక్సర్లు, 5 బౌండరీలతో 84 పరుగులతో, జే రిచర్డ్‌సన్ పరుగులేవీ చేయకుండానే నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రాకు మూడు వికెట్లు, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్‌కు తలో వికెట్ లభించాయి. నాలుగో వనే్డలో గెలుపుతో భారత్-ఆస్ట్రేలియా 2-2తో సమంగా ఉన్నాయి. ఇక సిరీస్‌లో ఆఖరిది ఐదో మ్యాచ్ ఇరు జట్లకూ అత్యంత కీలకం కానున్నాయి.

చిత్రాలు.. మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఆస్టన్ టర్నర్ (43 బంతుల్లో 84 పరుగులు)
*ఇరు జట్ల సెంచరీ హీరోలు శిఖర్ ధావన్, పీటర్ హాండ్స్‌కోంబ్