క్రీడాభూమి

సన్‌రైజర్స్‌కు ఢిల్లీ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: వరుస విజయాలతో ఊపుమీద ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఢిల్లీ డేర్‌డెవిల్స్ షాకిచ్చింది. గురువారం జరిగిన ఐపిఎల్ గ్రూప్ మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగి, 20 ఓవర్లలో 146 పరుగులు చేసిన సన్‌రైజర్స్ ఆతర్వాత డేర్‌డెవిల్స్‌ను నిలువరించలేకపోయింది. మరో 11 బంతులు మిగిలి ఉండగానే, డేర్‌డెవిల్స్ మూడు వికెట్లు నష్టపోయి 150 పరుగులు సాధించడంతో సన్‌రైజర్స్‌కు హోం గ్రౌండ్‌లోనే ఓటమి ఎదురైంది.
డేర్‌డెవిల్స్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు కెప్టెన్ డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ పార్ట్‌నర్‌షిప్‌ను అందించారు. 8.5 ఓవర్లలో 67 పరుగులు జోడించిన తర్వాత జయంత్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ వెనుదిరిగిన వార్నర్ 30 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 46 పరుగులు సాధించాడు. ధావన్ 37 బంతులు ఎదుర్కొని 34 పరుగుల చేసి, అమిత్ మిశ్రా బౌలింగ్‌లో సంజూ శాంసన్‌కు చిక్కాడు. అతని స్కోరులో మూడు ఫోర్లు ఉన్నాయి. యువరాజ్ సింగ్ (8), మోజెస్ హెన్రిక్స్ (0) క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయారు. భూపీందర్ హూడా 9 బంతుల్లో 10 పరుగులు చేసి నాథన్ కౌల్టన్ నైల్ బౌలింగ్‌లో బంతిని కొట్టబోయి హిట్ వికెట్‌గా అవుటయ్యాడు. సన్‌రైజర్స్ స్కోరును 150 పరుగుల మైలురాయిని దాటిస్తాడనుకున్న కేన్ విలియమ్‌సన్ 24 బంతుల్లో, మూడు ఫోర్ల సాయంతో 27 పరుగులు చేసి క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో సన్‌రైజర్స్ రన్‌రేట్ గణనీయంగా తగ్గింది. నమన్ ఓఝా (7), భవనేశ్వన్ కుమార్ (1) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులు చేయగా, అప్పటికి బరీందర్ శరణ్, ఆశిష్ నెహ్రా చెరొక పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. డేర్‌డెవిల్స్ బౌలర్లు నాథన్ కౌల్టర్ నైల్, అమిత్ మిశ్రా చెరి రెండు వికెట్లు పడగొట్టారు. మిశ్రా మూడు ఓవర్లు బౌల్ చేసి, కేవలం 19 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టడం విశేషం. అతను ధావన్, యువరాజ్ సింగ్‌లను వెనక్కు పంపి, సన్‌రైజర్స్‌ను కట్టడి చేశాడు.
ఆచితూచి బ్యాటింగ్
సన్‌రైజర్స్ దూకుడును అడ్డుకోవడానికి 147 పరుగులు సాధించాల్సి ఉండగా డేర్‌డెవిల్స్ ఆటగాళ్లు ఆచితూచి ముందుకు సాగారు. మాయాక్ అగర్వాల్ 10 పరుగులు చేసి ఆశిష్ నెహ్రా బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ క్యాచ్ అందుకోవడంతో అవుట్‌కాగా, కరుణ్ నాయర్ 17 బంతులు ఎదుర్కొని, 20 పరుగులు చేసి మోజెన్ హెన్రిక్స్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఓపెనర్ క్వింటన్ డికాక్ వ్యూహాత్మంగా ఆడుతూ, 31 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 44 పరుగులు సాధించి మోజెస్ హెన్రిక్స్ బౌలింగ్‌లోనే నమన్ ఓఝాకు చిక్కాడు. 78 పరుగులకు మూడు వికెట్లు కూలగా, సంజూ శాంసన్, రిషభ్ పంత్ మరో వికెట్ కూల్చకుండా జాగ్రత్త పడుతూ 18.1 ఓవర్లలోనే డేర్‌డెవిల్స్‌ను లక్ష్యానికి చేర్చారు. మూడు వికెట్లకు 150 పరుగులు సాధించిన ఈ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించే సమయానికి సంజూ శాంసన్ 26 బంతుల్లో 34, రిషభ్ పంత్ 26 బంతుల్లో 39 చొప్పున పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

* సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్‌లో 46 పరుగులు సాధించే క్రమంలో ఈసీజన్‌లో 500 పరుగుల మైలురాయిని అధిగమించాడు. అంతేగాక, వరుసగా రెండు ఐపిఎల్ సీజన్లలో ఐదు వందలకుపైగా పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. ఇంతకు ముందు క్రిస్ గేల్ (2014, 2015, 2016) ఈ ఫీట్ సాధించాడు. కాగా, ఈ మ్యాచ్‌లోనే వార్నర్ ఐపిఎల్‌లో మూడు వేల పరుగులను పూర్తి చేశాడు. ఈ మైలురాయిని అధిగమించిన ఎనిమిదో బ్యాట్స్‌మన్‌గా, రెండో విదేశీ ఆటగాడిగా అతని పేరు రికార్డు పుస్తకాల్లో చేరింది.
* సన్‌రైజర్స్ మొదటి పది ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 80 పరుగులు చేసింది. చివరి పది ఓవర్లలో వేగంగా పరుగులు సాధించాలన్న ఆతృతతో ఏడు వికెట్లు చేజార్చుకొని, 66 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒకానొ దశలో వికెట్ నష్టానికి 98 పరుగులు చేసిన సన్‌రైజర్స్ ఆతర్వాత కేవలం 15 బంతుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది.
* డేర్ డెవిల్స్ తరఫున ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ను క్వింటన్ డికాక్, మాయాంక్ అగర్వాల్ ఆరంభించారు. ఐదు మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఐదుగు ఓపెనింగ్ పార్ట్‌నర్స్‌తో ప్రయోగాలు చేయడం విశేషం.
* పవర్ ప్లేలో సన్‌రైజర్స్ 51, డేర్‌డెవిల్స్ 50 చొప్పున మొత్తం 101 పరుగులు జత కలిశాయి. ఈసారి ఐపిఎల్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఇది ఏడో మ్యాచ్‌కాగా, పవర్ ప్లేలో నమోదైన అత్యధిక పరుగులు ఇవే.
--
సంక్షిప్త స్కోర్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్: 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 (డేవిడ్ వార్నర్ 46, శిఖర్ ధావన్ 34, కేన్ విలియమ్‌సన్ 27, నాథన్ కౌల్టర్ నైల్ 2/25, ఆమిత్ మిశ్రా 2/19).
ఢిల్లీ డేర్‌డెవిల్స్: 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 150 (క్వింటన్ డికాక్ 44, సంజూ శాంసన్ 34 నాటౌట్, రిషభ్ పంత్ 39 నాటౌట్).