క్రీడాభూమి

అనవసర విషయాల్ని పట్టించుకోను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, మార్చి 11: ‘నేను న్యూస్ పేపర్లు చద్వను. అవసరం లేని విషయాల్ని అస్సలు పట్టించు కోను. కాబట్టి నాపై వచ్చే విమర్శల గురించి నాకు తెలిసే అవకాశమే లే దు. ఆలోచనలకు అనుగుణంగా నా ప్రపంచంలో నేను జీవిస్తుంటా. ఏదై నా అంశం నన్ను బాధిస్తే వెంటనే దాని నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తా’నని టీమిండియా ఓపెన ర్ శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. చాలా రోజుల తర్వాత ఆస్ట్రేలియాతో జరిగి న నాలుగో వనే్డ ధావన్ సెంచరీ చేసి మళ్లీ ఫాంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయతే అంతకుముందు తనపై వచ్చిన విమర్శలపై స్పందించ నంటూ మీడియాతో చెప్పుకొచ్చాడు. ధావన్ గత ఆర్నెళ్లుగా ఫాంలో లేని విషయం తెలిసిందే. ఈ ఏడాది 11 వనే్డలాడిన గబ్బర్ రెండు అర్ధ సెంచరీ లు మాత్రమే చేసిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మ్యాచ్ లో 147 పరుగులతో కెరీర్‌లోనే అత్యధిక స్కోరును నమోదు చేశాడు. అంతేకాకుండా ధావన్‌కు గత 17 మ్యాచ్‌ల్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఇటీవల వరుస మ్యాచ్‌ల్లో విఫలమవుతుండడంతో ఈ ఏడాది జరిగే ప్రపంచకప్ జట్టులో చోటుపై సందిగ్ధం నెలకొనగా, ప్రస్తుతం ఫాం లోకి రావడం ధావనతో పాటు అభి మానులూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.