క్రీడాభూమి

సోల్డ్రాతో నేడు విజేందర్ ఫైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోల్టన్, మే 12: భారత బాక్సర్ విజేందర్ సింగ్ శుక్రవారం జరిగే ప్రొఫెషనల్ ఫైట్‌లో పోలండ్‌కు చెందిన అడ్రెజ్ సోల్డ్రాను ఢీకొనేందుకు సిద్ధమయ్యాడు. ఎనిమిది రౌండ్లు జరిగే ఈ ఫైట్‌లో విజయం తనదేనని సోల్ట్రా వ్యాఖ్యానించగా, వరుసగా ఐదు ఫైట్స్‌లో నెగ్గిన తాను ఆరో విజయాన్ని సాధిస్తానని విజేందర్ ధీమా వ్యక్తం చేశాడు. మాటల వల్ల ఫలితం ఉండదని, రింగ్‌లోకి దిగిన తర్వాత ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందని అతను పిటిఐతో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. ఈ ఆరో ఫైట్ కోసం తాను అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. వచ్చేనెల 11న న్యూఢిల్లీలో జరిగే డబ్ల్యుబిఓ ఆసియా చాంపియన్
షిప్ ఫైట్ జరగనున్న నేపథ్యంలో సోల్డ్రాతో పోరు విజేందర్‌కు కీలకంగా మారింది. కాగా, ప్రొఫెషనల్‌లా సోల్ట్రా ఇప్పటి వరకూ 98 ఫైట్స్‌లో పాల్గొని, 82 విజయాలను సాధించాడు. అపారమైన అనుభవం ఉన్న అతనిని ఓడించడం విజేందర్‌కు అసాధ్యం కాకపోయినా సులభం మాత్రం కాదు.

chitram ప్రొఫెషనల్ బాక్సింగ్ ఫైట్‌లో పోటీపడనున్న అడ్రెజ్ సోల్డ్రా, విజేందర్ సింగ్