క్రీడాభూమి

మళ్లీ జట్టులోకి వార్నర్, స్మిత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, మార్చి 17: బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది కాలం పాటు క్రికెట్‌కు దూరమైన ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ తిరిగి జట్టులో చోటు సంపాదించుకున్నారు. వీరిద్దరినీ క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నెల 22 నుంచి దుబాయ వేదికగా పాకిస్థాన్‌తో జరిగే వనే్డ సిరీస్‌కు ఎంపిక చేసింది. దీంతో ఇన్నాళ్లూ నిషేధానికి గురై న వీరు షార్జా వేదికగా జరిగే మొదటి వనే్డలో మైదానం లోకి దిగనున్నారు. పాకిస్థాన్‌తో ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్ ఆడనుంది. మరోవైపు ప్రపంచకప్‌కు ముందు ఇద్దరు సినీయర్ ఆటగాళ్లు జట్టులో చేరడం ఆస్ట్రేలియా జట్టుకు ఊరటనిచ్చే అంశమే.
వరుస ఓటములు
గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ వివాదంతో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ జట్టుకు దూరమవడంతో ఆస్ట్రేలియా వరుస ఓటముల ను చవిచూసింది. ఈ క్రమంలోనే టీమిండియా ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే టెస్టు, వనే్డ సిరీస్‌లను గెలుచుకుంది.
ఐపీఎల్‌కూ రె‘్ఢ’..
ఏడాది నిషేధం ముగియడంతో వార్నర్, స్మిత్ ఐపీ ఎల్ ఆడేందుకు సిద్ధమయ్యారు. ఐపీఎల్‌లో వార్నర్ సన్‌రైజర్ హైదరాబాద్, స్మిత్ రాజస్థాన్ రాయల్స్ జట్లకు ప్రాతిని థ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు స్టీవ్ స్మిత్ ఆదివారం జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు క్యాంపు నకు హాజరైన ట్టు ఆ జట్టు బ్రాండ్ అంబాసిడర్ షేన్ వార్న్ తెలిపాడు. నిషేధం ముగించుకున్న స్మిత్ పరుగుల దాహం తో ఉన్నాడని, తప్పకుండా కసిగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చుతాడని వార్న్ ధీమా వ్యక్తం చేశాడు.
చిత్రం.. వార్నర్, స్మిత్ కరచాలనం